బర్త్‌డే సందర్బంగా చిరు మూవీ అప్డేట్‌ ఇచ్చిన దర్శకుడు

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.షూటింగ్‌ ను ముగించేశారు.

 Chiranjeevi And Director Bobby Combo Movie Shooting In Dusara-TeluguStop.com

చిరంజీవి ఆచార్య తర్వాత లూసీఫర్‌ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.ఆ రీమేక్ తర్వాత మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని వేదాళం సినిమా కంటే ముందుగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.బాబీ దర్శకత్వంలో సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

 Chiranjeevi And Director Bobby Combo Movie Shooting In Dusara-బర్త్‌డే సందర్బంగా చిరు మూవీ అప్డేట్‌ ఇచ్చిన దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.బాబీ చెప్పిన కథ నచ్చడం వల్ల చిరంజీవి నటించేందుకు సిద్దం అయ్యాడు.

బాబీ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఒక కీలక అప్డేట్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇవ్వడం జరిగింది.

Telugu Acharya, Chiranjeevi, Director Bobby, Film News, Lucifer-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తో సినిమాను దసరా సందర్బంగా ప్రారంభించబోతున్నట్లుగా బాబీ పేర్కొన్నాడు.లూసీఫర్‌ సినిమా అప్పటి వరకు పూర్తి అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.

అయినా కూడా బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా పట్టాలెక్కబోతుంది.దాదాపుగా రెండు ఏళ్లుగా దర్శకుడు బాబీ చిరంజీవి డేట్ల కోసం వెయిట్‌చ ఏస్తున్నాడు.

ఎట్టకేలకు అక్టోబర్ నుండి సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లకు వరుసగా చిరంజీవి డేట్లు ఇస్తున్నాడు.

ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ కు గాను చిరంజీవి రెండు నెలల సమయం కేటాయించబోతున్నాడు.ఈ నెలలోనే లూసీఫర్‌ సినిమా పట్టాలెక్కబోతుంది.

సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తామని అంటున్నారు.ఇక బాబీ దర్శకత్వంలో సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తారేమో చూడాలి.

 ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ స్టార్‌ తో బాబీ చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

#Chiranjeevi #Lucifer #Acharya #Bobby

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు