త్రిషకు ఆచార్య ట్వీట్.. ఏమన్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

 Chiranjeevi, Acharya, Trisha, Telugu Movie News, Koratala Siva-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టక ముందే ఇందులో హీరోయిన్‌గా అందాల భామ త్రిషను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.కానీ సినిమా షూటింగ్ మొదలయ్యే సరికి ఆమె ఈ సినిమా నుండి కొన్ని కారణాల వల్ల వెళ్లిపోయింది.

దీంతో ఒక్కాసారిగా ఖంగుతిన్న ఆచార్య చిత్ర యూనిట్ వెంటనే తేరుకుని తమ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కాజల్ అగర్వాల్‌ను ఓకే చేసుకున్నారు.భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం వారు అంగీకరించి ఈ సినిమాలో నటించేలా ఆమెను ఒప్పించారు.

కాగా చిరు సినిమా నుండి ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడంతో త్రిష తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక సోషల్ మీడియాలో త్రిషను మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఏసుకున్నారు.

కాగా తాజాగా త్రిషకు చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు.సోమవారం మే 4న పుట్టినరోజు జరుపుకుంటున్న త్రిషకు ఆచార్య తనదైన స్టయిల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇలా తన సినిమా నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయిన బ్యూటీకి చిరు బర్త్‌డే విషెస్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చిరు అందరివాడు కాబట్టి త్రిషకు బర్త్‌డే విషెస్ చెప్పాడని, మిగతా హీరోలైతే కనీసం పట్టించుకునే వారు కూడా కాదని మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube