ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమా రిలీజ్ డేట్లు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలతో ప్రేక్షకులకు చేరువవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలో అదే రోజున బాలీవుడ్ హీరోల సినిమాలు విడుదలైతే ఇతర భాషల్లో తెలుగు హీరోల సినిమాల కలెక్షన్లపై బాలీవుడ్ సినిమాల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తుండగా మే 13వ తేదీన ఆ మూవీ విడుదలవుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే డేట్ ఫిక్సైంది.
అయితే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న రాధే సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతూ ఉండటం గమనార్హం.
రాధే సినిమా రిలీజైతే హైదరాబాద్, వైజాగ్ లాంటి ఏరియాలలో ఆచార్య సినిమాకు తక్కువ సంఖ్యలో మల్టీప్లెక్స్ లు దొరికే అవకాశం ఉంటుంది.మరోవైపు రాధే సినిమా రిలీజ్ డేట్ ఆచార్య సినిమా ఓవర్సీస్ మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఐతే ఉంటాయని చెప్పవచ్చు.
ఆచార్య సినిమా కోసం వెంకటేష్ నారప్ప సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో సల్మాన్ ఖాన్ రూపంలో చిరంజీవికి షాక్ తగిలింది.గతంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజైన రోజే హృతిక్ రోషన్ వార్ మూవీ కూడా రిలీజ్ కావడంతో సైరా కలెక్షన్ల విషయంలో నష్టపోయింది.ఆచార్య రెవిన్యూపై కూడా రాధే సినిమా ప్రభావం పడే అవకాశం ఉంది.
మరో బాలీవుడ్ మూవీ సత్యమేవజయతే కూడా అదే రోజున విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆచార్య మూవీకి పెద్దగా పోటీ లేకపోయినా బాలీవుడ్ నుంచి మాత్రం పోటీ ఎదురవుతూ ఉండటం గమనార్హం.అయితే కొరటాల ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఆచార్య సినిమాతో చిరంజీవి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందనే చెప్పాలి.