కొరటాల ఓపికను మెచ్చుకోవాల్సిందే  

chiranjeevi acharya movie shooting update, allu arjun, koratala siva, chiranjeevi, acharya shooting - Telugu Acharya, Acharya Shooting, Allu Arjun, Chiranjeevi, Chiranjeevi Acharya Movie Shooting Update, Koratala Shiva, Koratala Siva, Ram Charan, Telugu Film News

మెగాస్టార్ 152 వ సినిమా ఆచార్యకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

TeluguStop.com - Chiranjeevi Acharya Next With Allu Arjun

సినిమా బ్యాలెన్స్ షూటింగ్‌ ను జూన్ జులై వరకు పూర్తి చేస్తే ఆగస్టు నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు కొరటాల శివ తీవ్రంగా ప్రయత్నించారు.కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను అర్థాంతరంగా ఆగిపోయింది.
గత నెల నుండి టాలీవుడ్ లో షూటింగ్ ల హడావుడి కొనసాగుతోంది.అయితే చిరంజీవి ఈనెల లేదా వచ్చే నెలలో షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని అంతా అనుకున్నారు.

కానీ ఆయన ఆరోగ్యం మరియు ఇతరత్రా కారణాల వల్ల డిసెంబర్ వరకు ఆయన ఆచార్య షూటింగులో జాయిన్ అయ్యే అవకాశం లేదని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.భరత్ అనే నేను సినిమా వచ్చి మూడేళ్లు కావస్తోంది.

TeluguStop.com - కొరటాల ఓపికను మెచ్చుకోవాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినా కూడా ఇప్పటి వరకు దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమా విడుదల చేయలేక పోయాడు.ఆచార్యను వెంటనే పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్నాడు.ఈ సమయంలో చిరంజీవి ఇలా ఆలస్యం చేస్తున్నప్పటికీ ఆయన ఎంతో ఓపికగా చిరు డేట్స్‌ కోసం వెయిట్ చేస్తున్నాడు.
అతి త్వరలోనే చిరంజీవి తో చేస్తున్న ఆచార్య మూవీ ని పూర్తి చేసి అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తున్నాడు.

కాని చిరు మూవీ ఆలస్యం అవుతోంది.దాంతో అల్లు అర్జున్‌ తో చేయాల్సిన మూవీ ఆలస్యమవుతోంది.కొరటాల శివ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.ఆ కారణంగా ఆచార్య సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టి పరిస్థితిలో సినిమాను వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కు జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు.

#Koratala Shiva #Chiranjeevi #Allu Arjun #Ram Charan #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Acharya Next With Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..