ఆచార్య రూ.20 కోట్ల సెట్‌ పుకార్ల వెనుక కారణం ఇదన్నమాట

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా గురించి కొన్ని రోజుల క్రితం మీడియాలో ఒక వార్త జోరుగా వచ్చింది.అది ఏంటీ అంటే ఆచార్య సినిమా కోసం రూ.20 కోట్లతో సెట్టింగ్‌ ను వేస్తున్నారు.దేవాలయాల సెట్‌ ను వేసేందుకు భారీగా ఖర్చు పెట్టారు అంటూ వార్తలు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ సినిమాకు రూ.20 కోట్లు పెట్టి సెట్టింగ్ ను తెలుగులో వేయించలేదు.దాంతో అంతా కూడా అవాక్కయ్యారు.కొందరు మాత్రం అంత సీన్ లేదు లే అనుకున్నారు.తాజాగా క్లారిటీ వచ్చింది.భారీ సెట్‌ నిజమే.

 Chiranjeevi Acharya Movie Temple City Setting Cost Clarity-TeluguStop.com

దేశంలోనే అతి పెద్ద దేవాలయాల సెట్‌ అనేది నిజమే.కాని 20 కోట్ల వ్యయం మాత్రం నిజం కాదని క్లారిటీ వచ్చింది.20 ఎకరాల్లో ఈ భారీ టెంపుల్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నారు.

ఆచార్య సినిమా లోని కీలక సన్నివేశాలను ఆ టెంపుల్‌ సిటీలోనే చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది.తాజాగా చిరంజీవి షేర్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.20 ఎకరాల్లో రూపొందిన ఆ సెట్‌ ఖరీదు 6 నుండి 7 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఎక్కువ శాతం రియల్‌ గా దేవాలయ గోపురాలు మరియు ఇండోర్‌ దేవాలయంను చూపించారంటూ తెలుస్తోంది.అద్బుతమైన లొకేషన్‌ ల్లో సినిమాను చిత్రీకరించిన కొరటాల ఇప్పుడు ఈ సెట్‌ లోనే చిత్రీకరిస్తున్నాడు.

 Chiranjeevi Acharya Movie Temple City Setting Cost Clarity-ఆచార్య రూ.20 కోట్ల సెట్‌ పుకార్ల వెనుక కారణం ఇదన్నమాట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్‌ లో వచ్చే నెలలో రామ్‌ చరణ్‌ జాయిన్‌ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.వచ్చే నెలతో సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.రెజీనా ఐటెం సాంగ్‌ చేసింది.

ఈ సినిమా కోసం సోనూ సూద్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

#Acharya #Temple #Chiranjeevi #Kajal Agarwal #Acharya Temple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు