మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా టీజర్ వచ్చేసింది.ముందుగా చెప్పినట్లుగానే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆచార్య టీజర్ వచ్చేసింది.
రామ్ చరణ్ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మరింతగా హైలైట్ అయ్యింది అన్నట్లుగా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఈ సారి కొత్తగా ప్రయత్నిస్తున్నాడా అనిపించింది.
మెగా స్టార్ ను ఎలా అయితే అభిమానులు చూడాలని ఆశ పడతారో ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు అలాగే చూపించారు అనడంలో సందేహం లేదు.అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ చూపించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతూ వస్తున్నారు.
టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మాట కూడా అదే.
ఆచార్య సినిమాలో చిరంజీవి పాత్ర ఏంటీ అనే విషయంలో పూర్తి గా క్లారిటీ ఇవ్వకుండా కథ విషయంలో సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తూ ఒక విభిన్నమైన గెటప్ లో ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ తో చిరంజీవిని దర్శకుడు చూపించాడు.పాఠాలు చెప్పక పోయినా అందరు నన్ను ఆచార్య అంటున్నారు.గుణపాఠాలు చెప్పడం వల్ల అలా అంటున్నారేమో అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ అదిరి పోయింది.
అద్బుతమైన చిరంజీవి ఎనర్జికి తగ్గట్లుగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.ఇక చిరంజీవి చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.
బరువు తగ్గడంతో పాటు ఆ కాస్ట్యూమ్స్ లో ఆయన లుక్ అదిరింది.ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
చరణ్ కు జోడీగా పూజా హెగ్డే అంటున్నారు.