ఏ క్షణంలో అయినా 'ఆచార్య' రెండవ ప్రకటన రావచ్చు

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్‌ ఆచార్య సినిమా లో మునిగి తేలిపోతూ ఉండేవారు.

 Megastar Chiranjeevi Acharya Movie Second Song Coming Soon , Acharya, Acharya So-TeluguStop.com

కొరటాల శివ ఇప్పటి వరకు అపజయంను ఎరిగి ఉండడు.అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

అందుకే గత నెలలో విడుదల అయ్యి ఉంటే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకునేది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అయ్యేవి.

కాని ఇప్పటి వరకు ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేయలేదు.కనీసం ఈ సినిమా ను ఆగస్టులో అయినా విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఇప్పుడు మెగా కాంపౌండ్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టులో లేదా దసరాకు విడుదల చేయబోతున్నారట.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అందులో భాగంగానే ఈ నెలలో ఆచార్య రెండవ పాట విడుదలకు సిద్దం అయ్యింది.

ఆచార్య రెండవ పాట విడుదల సందర్బంగా సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

పెద్ద ఎత్తున సినిమా ను విడుదల చేసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మరియు విదేశాల్లో కూడా ఆచార్య ను విడుదల చేయాల్సి ఉంది.కనుక అప్పటి వరకు అంతా క్లీయర్ అయ్యి థియేటర్లు పూర్తి స్థాయి ఆక్కుపెన్సీతో నడిస్తే అప్పుడు ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేయబోతున్నారు.అందులో భాగంగానే ఆచార్య నుండి రెండవ పాటను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మణి శర్మ నుండి వచ్చిన లాహె లాహె పాట ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయ్యింది.కనుక ఈ పాట కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube