'ఆచార్య' విడుదల ఒత్తిడి వల్లే ఆ ప్రకటన వచ్చిందా?

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల మే నెలలో అవ్వాల్సి ఉంది.కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమా ను వాయిదా వేయడం జరిగింది.

 Chiranjeevi Acharya Movie Release Date News-TeluguStop.com

షూటింగ్‌ కేవలం వారం నుండి పది రోజులు మాత్రమే ఉంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారు.కాని ఇప్పుడు మాత్రం సినిమా రెండు పాటల బ్యాలన్స్ ఉంది అంటూ అధికారికంగా ప్రకటించారు.

రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని చిరంజీవి ఆచార్య టీమ్‌ ప్రకటించడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు చర్చిస్తూ ఉండగా ఆసక్తికర విషయం ఒకటి చర్చకు వస్తోంది.అదేంటీ అంటే ఆచార్య సినిమా విడుదల కోసం సోషల్‌ మీడియా ద్వారా చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Chiranjeevi Acharya Movie Release Date News-ఆచార్య’ విడుదల ఒత్తిడి వల్లే ఆ ప్రకటన వచ్చిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది అంటే ఆ ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది.అందుకే సినిమా షూటింగ్‌ ఇంకా చాలా ఉంది అన్నట్లుగా కలర్‌ ఇస్తున్నారు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఆచార్య విడుదల తేదీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రతి సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వస్తుంది కాని మెగా స్టార్‌ సినిమా విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వక పోవడం పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుష్ప క్రిస్మస్‌ కు విడుదల అవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.

Telugu Aacharya Movie Update, Acharya, Acharya Movie, Chiranjeevi, Film News, Kajal Agarwal, Pooja Hegde, Ram Charan, Tollywood-Movie

కనుక ఆచార్య కు విడుదల చేసేందుకు సరైన సమయం లేకుండా పోయింది.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ సంక్రాంతి వరకు సినిమాలు విడుదల అవుతున్నాయి.ఆచార్య వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవితో పాటు చరణ్‌ కూడా సినిమా లో నటించడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.హీరోయిన్‌ లుగా కాజల్ మరియు పూజా హెగ్డే నటించారు.ఆచార్య విడుదల తేదీ విషయమై ఎప్పటికి స్పష్టత వస్తుందో చూడాలి.

#Acharya #Aacharya #Kajal Agarwal #Pooja Hegde #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు