సంక్రాంతి రేస్‌ లో జాయిన్‌ అవుతున్న 'ఆచార్య'

వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా చిరంజీవి ఆచార్య సినిమా ను సంక్రాతి రేస్ లో నిలుపబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రముఖ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశాడు.

 Chiranjeevi Acharya Also Joins Sankranthi Festival Race Update, Acharya, Acharya-TeluguStop.com

ఆయన ఇండస్ట్రీకి చాలా క్లోజ్ గా ఉండి అన్ని విషయాలను అంచనా వేస్తూ ఉంటాడు.కనుక ఆచార్య ను సంక్రాంతికి విడుదల చేస్తారని ఆయన చెబుతున్నాడు కనుక ఖచ్చితంగా సంక్రాంతికే వస్తాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిరంజీవి సినిమా సంక్రాంతికి వస్తే మంచిదే.కాని ఇప్పటికే సంక్రాంతి సినిమాలు చాలా నే ఉన్నాయి.

రాధే శ్యామ్‌, సర్కారు వారి పాట మరియు భీమ్లా నాయక్‌ సినిమాకు సంబంధించిన విడుదల తేదీలను ప్రకటించి మరీ సంక్రాతి బరిలో ఉన్నారు.అంతటి టైట్ సంక్రాంతి షెడ్యూల్‌ లో చిరంజీవి వచ్చి చేరడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది.

చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ఏడాది లో దసరా సీజన్ కు ఎందుకు ఎవరి సినిమాలు రావడం లేదు అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Acharya, Bheemla Nayak, Chiranjeevi, Radhe Shyam, Sarkaruvaari, Tollywood

రాజమౌళి సినిమా ఉంది అనే కారణంగా ఇన్నాళ్లు ఆ తేదీపై మరియు ఆ సినిమా విడుదల అయిన వారం విడుదలకు ముందు వారం వరకు సినిమా లు విడుదల కాకుండా ప్లాన్‌ చేస్తున్నారు.కాని ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల క్యాన్సిల్‌ అవ్వబోతున్న నేపథ్యం లో ఎందుకు ఆచార్య ను అక్టోబర్‌ లో విడుదల చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యం లేదు అంటున్నారు.కనుక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సంక్రాంతి తర్వాత వస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube