చిరు ఆవేదన.. మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదేం?

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తుండి పోయే వ్యక్తి మహానటుడు ఎస్వీ రంగారావు.తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను సృష్టించుకున్న ఎస్వీఆర్‌ నూరవ జయంతి వేడుకలు తాజాగా జరిగాయి.

 Chiranjeevi About Sv Ranga Rao-TeluguStop.com

ఈ వేడుకలో పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.ఎస్వీఆర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని, అనుభవాన్ని, ఆయన నుండి నేర్చుకున్న విషయాలను ప్రముఖులు చెప్పుకొచ్చారు.

ఎస్వీ రంగారావు జీవితం అందరికి ఆదర్శనీయం అని, అన్ని విధాల పాత్రలు చేయడంతో పాటు, అందరితో మంచితనంతో ఉండేవాడు అని, అలాంటి నటుడు తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ రారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎస్వీఆర్‌ నూరవ జయంతి సందర్బంగా చిరంజీవి ఒక మీడియా సంస్థకు బైట్‌ ఇవ్వడం జరిగింది.ఆ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.తాను చిన్న వయస్సులో ఉన్న సమయంలో ఎస్వీఆర్‌ గారు స్టార్‌గా దూసుకు పోతున్నారు.

మా తండ్రిగారు కొన్ని చిత్రాల్లో ఎస్వీఆర్‌ గారితో కలిసి నటించారు.ఆయన ఎస్వీఆర్‌ గారి గురించి చెబుతున్న సమయంలో ఒు్ల మర్చి మరీ వింటూ ఉండేవాడిని, ఎస్వీఆర్‌ గారి గొప్పదనం తన తండ్రి చెబితే అర్థం అయ్యింది.

అందుకే నటుడిని కావడానికి ముందు ఆయన ఆశ్శీసులు తీసుకోవాలని భావించాను.

నేను నటుడిగా మారక ముందే ఆయన స్వర్గస్తులయ్యారు.

ఆయన్ను తాను జీవితంలో కలుసుకోలేక పోయాను.అది ఇప్పటికి, ఎప్పటికి కలిచి వేస్తూనే ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక ఎస్వీఆర్‌ గారు దేశం గర్వించదగ్గ సినీ ప్రముఖులు.అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఇవ్వాలి.

ఎస్వీఆర్‌ గారికి పాల్కే అవార్డును తీసుకు వచ్చేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు అయిన చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్‌లు ప్రయత్నించాలి అంటూ ఈ సందర్బంగా చిరంజీవి కోరడం జరిగింది.

ఎస్వీఆర్‌ గారికి పాల్కే అవార్డు గురించి చిరంజీవి ఇప్పుడు మాట్లాడటం సోచనీయం అని, నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా ఉండటంతో పాటు క్రియాశీలకంగా కేంద్రంలో వ్యవహరించిన చిరంజీవికి అప్పుడు ఎస్వీఆర్‌ గుర్తుకు రాలేదు కాని, ఇప్పుడు దాదాసాహెబ్‌ పాల్కే అవార్డును ఎస్వీఆర్‌కు ఇప్పించాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను డిమాండ్‌ చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ ఈ సందర్బంగా కొందరు విమర్శిస్తున్నారు.

ఎస్వీఆర్‌ గురించి మాట్లాడే అర్హత చిరంజీవికి లేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube