నా ఆఫర్ ను సాయి పల్లవి రిజెక్ట్ చేసింది.. అదే మంచిదైంది: చిరు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఎంతో ఘనంగా జరిగింది. నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్లో ఎంతో మంది ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

 Chiranjeevi, Love Story, Sai Pallavi, Tollywood,latest Movie News-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో భాగంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ వేడుకలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ సాయి పల్లవి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి “భోళా శంకర్” సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించాలని ముందుగా చిత్రబృందం సాయిపల్లవిని సంప్రదించారు.అయితే ఈ సినిమాకు సాయి పల్లవి ఒప్పుకోకూడదని చిరంజీవి భావించినట్లుగానే ఈ సినిమాను సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్లు…అలా రిజెక్ట్ చేయడం తనకు ఎంతో మంచిదయిందని మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో తెలియజేశారు.

సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలోని ఆమె డాన్స్ ను చూసిన మెగాస్టార్ తనతో కలిసి స్టెప్పులు వేయాలి అనుకున్నారట.

Telugu Ameer Khan, Chiranjeevi, Love Story, Lovestory, Naaga Chaitanya, Sai Pall

ఈ క్రమంలోనే తనతో స్టెప్పులు వేయాలనుకున్న మెగాస్టార్ చిరంజీవికి తనతో అన్నయ్యఅని పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని అందుకే ఈ సినిమా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే మెగాస్టార్ ఎంతో ఆనంద పడ్డారు.ఇక లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి నటించిన సారంగదరియా పాట ఎంతో అద్భుతంగా ఉందని సాయిపల్లవి పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ రీమేక్ చిత్రాలలో నటించాలంటే తనకు భయం అని మరోసారి తనకు అవకాశం కల్పించాలంటూ చిరంజీవి గారిని వేడుకుంది.

అలాగే చిరంజీవి నాగచైతన్యను ఉద్దేశించి మాట్లాడుతూ.చైతన్య నా తమ్ముడు నాగార్జునలాగే మిస్టర్ కూల్ అంటూ నాగచైతన్యకి బిరుదు ఇచ్చాడు.ఇలా లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న చిరంజీవి తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్లోనే చూడాలని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube