బర్త్ డే రోజు మెగాస్టార్ నుంచి బిగ్ ఎనౌన్స్ మెంట్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.మెగాస్టార్ గా తాను ఎప్పటికి నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

 Mega Surprises To Megastar Birth Day, Chiranjeevi, Aacharya Movie, Lucifer Movie-TeluguStop.com

అయితే ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో సామాజిక బాద్యత ఉన్న కథలకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.అదే సమయంలో తన నుంచి ప్రేక్షకులు ఆశించే హీరోయిజం, కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండే కథలని ఎంపిక చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో లూసిఫర్ సినిమాని తెరపైకి తీసుకొచ్చారు.ఈ సినిమాలో రైతుల సమస్యలని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమాల్ విషయంలో యువ దర్శకులు చెప్పే కథలకి మెగాస్టార్ ప్రాధాన్యత ఇస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ నెల 22 మెగాస్టార్ పుట్టినరోజు రానుంది.

ఈ పుట్టినరోజున మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చే న్యూస్ ఉండబోతుందని తెలుస్తుంది.అందులో మెగస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నుంచి టీజర్ తో పాటు, కొత్త సినిమాలు ఎనౌన్స్ మెంట్ కూడా ఉంటాయని టాక్ నడుస్తుంది.

అందులో లూసీఫర్ నుంచి ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.అలాగే బాబి దర్శకత్వంలో సినిమాని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ వినబోయే ఆ మెగా సర్ప్రైజ్ అప్డేట్స్ ఏమి ఉంటాయో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సైరా తర్వాత ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సంబంధించి ఎక్కువ అప్డేట్స్ రాలేదు.

అయితే ఈ సారి ఆయన పుట్టిన రోజున మాత్రం ఫ్యాన్స్ కి భారీ బొనంజాని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube