మెగా 153కి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా?  

Chiranjeevi 153 Movie Birthday August - Telugu 153 Movie, Acharya, August, Chiranjeevi 153 Movie Start On Chiru Birthday, Lucifer Remake, Megastar Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య అంతా బాగుంటే ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అయ్యేది.జులై లేదా ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు.

 Chiranjeevi 153 Movie Birthday August

కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి కూడా కాలేదు.ఈ కరోనా విపత్తు కారణంగా ఆచార్య సినిమా ఆగిపోయింది.

మళ్లీ ఎప్పుడు ప్రారంభం అయ్యేనో అర్థం కాని పరిస్థితి.ఈ సమయంలో చిరంజీవి 153వ చిత్రం గురించి మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తూ ఉన్నాయి.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మెగా 153 చిత్రం లూసీఫర్‌ రీమేక్‌ అని దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.సాహో దర్శకుడు సుజీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

మెగా 153కి ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా-Movie-Telugu Tollywood Photo Image

లూసీఫర్‌కు కాస్త మార్పులు చేర్పులు చేస్తున్న సుజీత్‌ ప్రముఖ రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో పడ్డాడు.ఇక ఈ సినిమా ప్రారంభం గురించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టుల్లో ఈ సినిమాను ప్రారంభించాలని, ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత రీమేక్‌ షూటింగ్‌ను మొదలు పెట్టాలని నిర్ణయించారు.అంటే ఈ ఏడాది చివర్లో లూసీఫర్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతుంది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ చివర్లో లేదా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆచార్య చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

లూసీఫర్‌ చిత్రానికి టైటిల్‌ ఒక పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi 153 Movie Birthday August Related Telugu News,Photos/Pics,Images..