వినాయక్‌ సాహసం అద్బుతం  

Chiranjeevi 150th With Vv Vinayak-

సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు చేయని సాహసంను యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ చేసి అందరిని ఆశ్చర్య పర్చాడు.తాజాగా ఈయన తెరకెక్కించిన ‘అఖిల్‌’ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెల్సిందే.ఈ సినిమా ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తనదే అంటూ మొత్తం భారం, పరాజయం తాలుకు పేరును తనపై వేసుకున్నాడు.

Chiranjeevi 150th With Vv Vinayak---

ఇంతటి సాహసం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏ ఒక్క ఇండస్ట్రీలో కూడా వేసుకుని ఉండరు.వినాయక్‌ చేసిన ఈ సాహసంను సినీ వర్గాల వారు సైతం మెచ్చుకుంటున్నారు.ఓటమిని ఒప్పుకున్న వారు భవిష్యత్తులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అనే నమ్మకంతో వినాయక్‌ ఉన్నాడు.

‘అఖిల్‌’తో నిరాశ పర్చిన వినాయక్‌ త్వరలో చిరంజీవి 150వ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న చిరు 150వ సినిమా వైపు ప్రస్తుతం అంతా చూస్తున్నారు.‘అఖిల్‌’ అంతటి ఫ్లాప్‌ అయినా కూడా వినాయక్‌పై నమ్మకంతో చిరంజీవి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఆయన చేతుల్లో పెట్టబోతున్నాడు.గతంలో ‘రమణ’ రీమేక్‌కు మంచి న్యాయం చేసిన వినాయక్‌ తాజాగా ‘కత్తి’ రీమేక్‌కు సైతం వినాయక్‌ న్యాయం చేస్తాడు అని మెగా క్యాంప్‌ భావిస్తోంది.

అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.‘అఖిల్‌’ ఫ్లాప్‌ వల్ల కసితో ఉన్న వినాయక్‌ చిరు 150వ సినిమాను తప్పకుండా సక్సెస్‌ చేస్తాడు అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.