శంకర్ దర్శకత్వంలో "చిరు"

చిరు 150సినిమాపై ఇంకా గుస గుసలు టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి.అసలైతే ఇప్పటికే మొదలవ్వాల్సిన ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

 Chiranjeevi 150th Movie Under Shankar Direction?-TeluguStop.com

అయితే ఇదే క్రమంలో ఈమధ్యనే హైదరాబాద్ లో జరిగిన ‘ఐ’ ఆడియో వేడుకలో తాను త్వరలో తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా తీస్తాను అని దర్శకుడు శంకర్ ప్రకటించడంతో చిరంజీవి చూపులు తిరిగి శంకర్ వైపు మళ్ళుతున్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి.ఎప్పటి నుండో చిరంజీవికి శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది అన్న వార్తలు సతియం టాలీవుడ్ లో వినిపిస్తూ వస్తున్నాయి.

గతంలో రజినీకాంత్ ‘రోబో’ ఆడియో ఫంక్షన్ లో కూడా ఈ విషయమై స్వయంగా చిరంజీవి శంకర్ ను బహిరంగంగా కోరిన సందర్భాలు ఉన్నాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి మనసు శంకర్ వైపు మళ్ళడానికి మరో బలమైన కారణం ఉంది అనే వార్తలు కూడా ఉన్నాయి.

తెలుగులో శంకర్ ‘ఐ’ సినిమాను డబ్ చేసి విడుదల చేస్తున్న నిర్మాత ఎన్ వి ప్రసాద్ చిరంజీవికి అత్యంత ఆత్మీయుడిగా పేరుంది.మళ్ళీ శంకర్ చిరంజీవిల కాంబినేషన్ కు సంబంధించి వార్తలు రావడం వెనుక నిర్మాత ప్రసాద్ వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా ప్రవర్తిస్తున్నాడు అనే వార్తలు కూడా ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

అయితే సినిమాలను అత్యంత నెమ్మదిగా తీయడమే కాకుండా తన సినిమాలలో నటించే హీరోల విషయమై అనేక ప్రయోగాలు చేసే శంకర్ ఆలోచనా సరళికి చిరంజీవి సరితూగుతాడా అనేది ప్రశ్న.ఏది ఎంతవరకు నిజమో తెలీదు కానీ.

శంకర్ తో చిరు సినిమా చేస్తే మాత్రం అదో సరికొత్త రికార్డు అన్న వాదన సైతం ఇండస్ట్రీ లో వినిపిస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube