చిరు, నాగ్‌.. మంచి మనసులో ఒకరిని మించి మరొకరు

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ముగిసింది.ఫినాలే ఎపిసోడ్‌ కు ప్రత్యేక అతిథిగా చిరంజీవి హాజరు అయ్యాడు.

 Chiranjeevi 10 Lakhs Rupees Gift For Mehaboob In Bigg Boss Finale Episode , Bigg-TeluguStop.com

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోలు ఇద్దరు కూడా స్టేజ్ పై చేసిన సందడి అంతా ఇంతా కాదు.మెగాస్టార్‌ చిరంజీవి మరియు కింగ్‌ నాగార్జునలు తమ స్టార్‌ డం మాత్రమే కాకుండా తమ మంచి మనసును కూడా చాటుకున్నారు.

విజేతను కాను అని అర్థం చేసుకున్న సోహెల్‌ అనూహ్యంగా ప్రైజ్‌ మనీలో సగంను తీసుకుని బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు.నెం.3 గా సోహెల్‌ బయటకు వస్తున్న సమయంలో రూ.25 లక్షల రూపాయలను తీసుకు వచ్చాడు.అందులో పది లక్షలను ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించాడు.కొద్ది సమయం తర్వాత సోహెల్‌ అయిదు లక్షలు ఆశ్రమానికి అయిదు లక్షలు మెహబూబ్‌ కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నాడు.

Telugu @akki_nagarjuna, @iamnagarjuna, @nagarjuna_fans, @nagfan_, Abhijeet, Bb F

మెహబూబ్‌ నేను కష్టపడుతాను ఆశ్రమానికే ఆ అయిదు లక్షలు ఇచ్చేద్దాం అన్నాడు.వీరిద్దరి బాండింగ్ చూసిన నాగార్జున సూపర్‌ మీరు ఆశ్రమానికి ఇవ్వనక్కర్లేదు.నేను ఆశ్రమానికి పది లక్షలు ఇస్తాను అంటూ నాగార్జున ముందుకు వచ్చారు.ఆ తర్వాత చిరంజీవి కి కూడా ఈ విషయం తెలిసింది.సోహెల్‌ కు వచ్చిన 25 లక్షల్లో 5 లక్షలు మెహబూబ్‌ కు ఇస్తానంటూ చెప్పడం షాకింగ్‌ గా అనిపించింది.అందుకే మెహబూబ్‌ కు నేను ఇస్తాను సోహెల్‌ ఆ మొత్తం డబ్బు నువ్వే ఉంచుకో అంటూ అప్పటికి అప్పుడు చిరంజీవి 10 లక్షల రూపాయల చెక్‌ ను మెహబూబ్‌ పేరు మీద రాసి సంతకం చేసి కూడా ఇచ్చాడు.

ఇక సోహెల్‌ కోసం చిరంజీవి తన ఇంటి నుండి సురేఖ గారి చేతులతో వండిన బిర్యానీని తీసుకు వచ్చాడు.ఈ రెంటితో చిరంజీవి ఎంత గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తో అర్థం అయ్యింది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

చిరంజీవి మరియు నాగార్జునలు ఇద్దరు కూడా నిన్నటి ఎపిసోడ్‌ లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube