చిన్నల్లుడిని చిరంజీవి పట్టించుకోవడం లేదా?

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా ‘విజేత’తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొదటి చిత్రంను రాకేష్‌ శశి దర్శకత్వంలో చేసిన కళ్యాణ్‌ దేవ్‌ ఆ చిత్రంను చేసిన విషయం తెల్సిందే.

 Chiraneevi Son In Law Kalyan Dhev Second Movie Confirmed-TeluguStop.com

ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో దర్శకుడు రాకేష్‌ శశి తెరకెక్కించినా కూడా మెగా హీరోలు పట్టించుకోలేదో లేక సరే అనుకున్నారో కాని ‘విజేత’ ఫ్లాప్‌ అయ్యింది.చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ను చిరంజీవి భారీ ఎత్తున ప్లాన్‌ చేయకుండా చాలా సింపుల్‌గా అల్లుడిని పరిచయం చేయడం చర్చనీయాంశం అవుతోంది.

మొదటి సినిమాతోనే అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా కళ్యాణ్‌ దేవ్‌ రెండవ ప్రాజెక్ట్‌కు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రెండవ సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది.ఈ రెండవ సినిమాతో కూడా కళ్యాణ్‌ దేవ్‌ ఒక కొత్త దర్శకుడితో చేస్తున్నాడు.కొత్త దర్శకుడితో ప్రయోగం మొదలు పెట్టిన కళ్యాణ్‌ దేవ్‌ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మెగాస్టార్‌ వంటి మామ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉండగా కూడా కళ్యాణ్‌ దేవ్‌ ఇలా కొత్త వారితో సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చరణ్‌ కోసం మంచి కథలు ఎంపిక చేసే చిరంజీవి ఎందుకు తన చిన్న అల్లుడి విషయంలో మాత్రం అంతగా కేర్‌ తీసుకోవడం లేదు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.ఒక్కటి రెండు సినిమాల్లో పెద్ద దర్శకులతో, క్రేజీ దర్శకులతో చేస్తే తప్పకుండా కళ్యాణ్‌ దేవ్‌ క్రేజ్‌ పెరగడం ఖాయం.కాని చిరంజీవి మాత్రం ఈయన్ను పట్టించుకోవడం లేదనిపిస్తోంది.

కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమాతో అయినా సక్సెస్‌ను దక్కించుకున్నానా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube