మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొదటి చిత్రంను రాకేష్ శశి దర్శకత్వంలో చేసిన కళ్యాణ్ దేవ్ ఆ చిత్రంను చేసిన విషయం తెల్సిందే.
ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించినా కూడా మెగా హీరోలు పట్టించుకోలేదో లేక సరే అనుకున్నారో కాని ‘విజేత’ ఫ్లాప్ అయ్యింది.చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ను చిరంజీవి భారీ ఎత్తున ప్లాన్ చేయకుండా చాలా సింపుల్‌గా అల్లుడిని పరిచయం చేయడం చర్చనీయాంశం అవుతోంది.
మొదటి సినిమాతోనే అట్టర్ ఫ్లాప్ అయినా కూడా కళ్యాణ్ దేవ్ రెండవ ప్రాజెక్ట్‌కు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.కళ్యాణ్ దేవ్ హీరోగా రెండవ సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది.ఈ రెండవ సినిమాతో కూడా కళ్యాణ్ దేవ్ ఒక కొత్త దర్శకుడితో చేస్తున్నాడు.కొత్త దర్శకుడితో ప్రయోగం మొదలు పెట్టిన కళ్యాణ్ దేవ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మెగాస్టార్ వంటి మామ బ్యాక్ గ్రౌండ్లో ఉండగా కూడా కళ్యాణ్ దేవ్ ఇలా కొత్త వారితో సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చరణ్ కోసం మంచి కథలు ఎంపిక చేసే చిరంజీవి ఎందుకు తన చిన్న అల్లుడి విషయంలో మాత్రం అంతగా కేర్ తీసుకోవడం లేదు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఒక్కటి రెండు సినిమాల్లో పెద్ద దర్శకులతో, క్రేజీ దర్శకులతో చేస్తే తప్పకుండా కళ్యాణ్ దేవ్ క్రేజ్ పెరగడం ఖాయం.కాని చిరంజీవి మాత్రం ఈయన్ను పట్టించుకోవడం లేదనిపిస్తోంది.
కళ్యాణ్ దేవ్ రెండవ సినిమాతో అయినా సక్సెస్‌ను దక్కించుకున్నానా చూడాలి.