బడా వ్యాపారవేత్త ని చిరు టార్గెట్ చేశాడా..?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా ఖైది నెంబర్ 150 చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విలన్ గా తరుణ్ అరోరా నటిస్తున్నా ఒకప్పటి హీరోయిన్ అంజలా ఝవేరి భర్త అయిన తరుణ్ అరోరా చిరుకి విలన్ గా నటిస్తున్నాడు.

 Chirajneevi Target Vijay Malya-TeluguStop.com

ఈ సినిమాలో తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు తరుణ్.సినిమాలో తానో బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తున్నానని.

విజయ్ మాల్యా టైం క్యారక్టర్ నాదని లీక్ చేశాడు.

తమిళ కత్తిలో ఆ క్యారక్టర్ కు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు కాని ఖైది నెంబర్ 150లో మాత్రం విజయ్ మాల్యాని పోలిన విలన్ గా తరుణ్ పాత్ర రూపొందిస్తున్నారు.

సో చిరు టార్గెట్ విజయ్ మాల్యా అన్నమాట.తను పాల్గొన్న మొదటి షెడ్యూల్ అద్భుతంగా జరిగిందని చిరంజీవి గారితో నటించడం త్రిల్లింగ్ గా ఉంది అంటున్నాడు తరుణ్ అరోరా.

పరారిలో ఉన్న విజయ్ మాల్యా టైపులో విలన్ పాత్రం క్రియేట్ చేయడం వినాయక్ కాస్త రిస్క్ చేస్తున్నాడనే అనాలి.ఇదవరకు ఠాగూర్ సినిమాను కూడా తమిళ వర్షన్ కు తన మార్క్ చేంజెస్ చేసి మంచి విజయాన్ని అందుకున్న వినాయక్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube