చిరంజీవి సంచలన నిర్ణయం..రాజకీయాలకి సెలవు

ఇప్పుడు ఈ వార్త అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ పెను సంచలనం సృష్టిస్తోంది.చిరంజీవికి రాజకీయాల మీద విరక్తి కలిగిందట ఇక రాజకీయాల్లో ఉండలేను అంటూ చిరు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

 Chirajeevi To Quit Politics-TeluguStop.com

ముందు నుంచీ సేవా కార్యక్రమాల పట్ల ఎంతో ఆకర్షితుడైన చిరంజీవి అందుకు తగ్గట్టుగానే ఎన్నో కార్యక్రమాలు చేసి చిరు సినిమా హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని అనిపించుకున్నారు.అయితే

ప్రజలకి సేవచేయాలనే ఉద్దేశ్యంతో ప్రజారాజ్యం పార్టీ ని పెట్టిన చిరు అనతికాలంలోనే దానిని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు.రాజకీయాలలో వచ్చే ఒడిదుడుకులు ఎంతో సున్నితమైన మనస్సు కలిగిన చిరు ఎదుర్కొనలేక పోయారు.ఫలితంగా చిరు రాజకీయాలలోకి వచ్చే తీవ్రంగా నష్టపోయారు…అభిమానం వేరు.

వాస్తవం వేరు అని కొంతకాలానికే తెలిసి వచ్చింది చిరు కి .పవన్ కల్యాణ్ ది దాదాపు అదే రూటు.కాకపోతే పవన్ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలను తిట్టే విషయంలో రకరకాలుగా మారుస్తూ వస్తున్నారు.కాసేపు చంద్రబాబు పాలన భేష్ అంటాడు.మరికాసేపు అవినీతి పరుడుని ముద్రవేశాడు.ఫలితంగా గుడ్ విల్ దెబ్బతింది.

ముందు నుంచీ ఒక వ్యూహాత్మక అడుగులు లేకపోవడమే చిరు బిగ్ మిస్టేక్ అని చెప్పవచ్చు.అయితే చిరు రాజకీయాలకి దూరం అవుతున్నారు అనే వార్త ఆనోటా ఈనోటా కాంగ్రెస్ అధిష్టానానికి తెలియడంతో రాహుల్ గాంధీ చిరుకి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు అదేంటంటే చిరంజీవి కి ఏపి పిసిసి పదవితో పాటు.

కేంద్ర కోర్ కమిటీలో సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట అయితే చిరు ముందు ఈ ప్రతిపాదన ఉంచినా సరే ఆయన సున్నితంగా వద్దని తెలిపారట.తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలపైనే దృష్టి పెడుతానని తేల్చి చెప్పారట చిరు.

అయితే కీలక సమయంలో చిరు ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ప్రచార భాద్యతలు ఎవరు తీసుకోవాలి.ఏపీలో ఈ సారి చిరుతో ప్రచారం నిర్వహించి ఎంతో కొంత మైలేజ్ సంపాదించాలి అనుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు చిరు తన రాజీనామా విషయం తెలుపడంతో ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం తలలు పట్టుకుంది అయితే చిరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా లేక .జనసేన పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందా అనే విషయం కొన్ని రోజుల్లో తేలిపోనుంది అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube