జైలులోనే చనిపోయి ఉండేవాడిని ! చింతమనేని సంచలన వ్యాఖ్యలు  

Chinthamaneni Prabhakar Sensastional Coments-

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జైలు పాలైన దెందులూరు టిడిపి మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు బెయిల్ పై విడుదలయ్యారు.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చింతమనేని సైలెంట్ గా ఉంటారని అంతా భావించారు.కానీ ఆయన మాత్రం వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేసి తానేంటో నిరూపించుకున్నారు.

Chinthamaneni Prabhakar Sensastional Coments- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Chinthamaneni Prabhakar Sensastional Coments--Chinthamaneni Prabhakar Sensastional Coments-

తనపై ఎస్సీ ఎస్టీ కేసు అన్యాయంగా బనాయించారని, తాను ఏ తప్పు చేయలేదని అసలు దళితులతో తాను అంత చనువుగా మరి ఏ ఇతర నాయకులు ఉండరని కావాలంటే ఈ విషయాన్ని ఆయా గ్రామాలకు వెళ్లి మీరే తెలుసుకోవచ్చని చింతమనేని సవాల్ విసిరారు.

Chinthamaneni Prabhakar Sensastional Coments- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Chinthamaneni Prabhakar Sensastional Coments--Chinthamaneni Prabhakar Sensastional Coments-

తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కోపంతోనే ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఇలా నాయకులను వేధిస్తున్నారని, తనపై 18 కేసులు పెట్టారని వాటిని నిరూపిస్తే ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పారు.

జగన్ కు 150మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారం పొగరుబోతు తనం ఎక్కువైంది అని విమర్శించారు.ఎంఆర్ఓ వనజాక్షి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ విషయంలో చంద్రబాబు తనపై కేసులు పెట్టించారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసును విచారించి నిజాలు ఏంటో తేల్చాలని చింతమనేని డిమాండ్ చేశారు, తనకు న్యాయదేవత పై నమ్మకం ఉందని లేకపోతే తాను కూడా కోడెల తరహాలోనే జైలులో చనిపోయి ఉండేవాడిని చింతమనేని సంచలన వ్యాఖ్యలు చేశారు.