పవన్‌కు బ్యాక్‌ టు బ్యాక్‌ షాక్‌ టు షాక్‌  

Chinthalapudi Venkatramaiah Resign In Janasena Party-chinthalapudi Venkatramaiah,gajuwaka,janasena Chief Pawan Kalyan

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొన్నటి ఎన్నికలో దారుణ పరాజయం పాలయినా కూడా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.ఒక వైపు పవన్‌ పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే మరో వైపు పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు పలువురు పార్టీని వదిలేస్తున్నారు.

Chinthalapudi Venkatramaiah Resign In Janasena Party-chinthalapudi Venkatramaiah,gajuwaka,janasena Chief Pawan Kalyan-Chinthalapudi Venkatramaiah Resign In Janasena Party-Chinthalapudi Gajuwaka Chief Pawan Kalyan

పార్టీని నడిపే సత్తా పవన్‌ కళ్యాణ్‌ కు లేదని, ఆయన పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాడనే నమ్మకం లేని జనసేన నాయకులు పలువురు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాడు.ఇటీవలే రాజమండ్రి కీలక నాయకుడు ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌ బై చెప్పగా ఇప్పుడు పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన నాయకుడు చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశాడు.

Chinthalapudi Venkatramaiah Resign In Janasena Party-chinthalapudi Venkatramaiah,gajuwaka,janasena Chief Pawan Kalyan-Chinthalapudi Venkatramaiah Resign In Janasena Party-Chinthalapudi Gajuwaka Chief Pawan Kalyan

గాజువాకలో కీలక నేతగా చింతలపూడికి మంచి పేరుంది.మొన్నటి ఎన్నికల్లో పవన్‌ గాజువాకలో పోటీ చేసిన సమయంలో ఈయన చాలా మద్దతు తెలిపారు.పవన్‌ కాకుండా గాజువాక నుండి చింతలపూడి జనసేన తరపున పోటీ చేసి ఉంటే గెలిచేవాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి.

అలాంటి బలమైన నేత అయిన చింతలపూడి పార్టీని వదిలేయడంతో గాజువాక నియోజక వర్గంలో జనసేన పార్టీ చాలా బలహీనం అవ్వడం ఖాయం.ఈయన తన రాజకీయ భవితవ్యం ఏంటీ అనే విషయమై తన కార్యకర్తలతో చర్చించబోతున్నాడు.

గాజువాక ప్రజల కోరిక మేరకు నేను పార్టీకి రాజీనామా చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు.