ఆనందిగా మళ్ళీ వస్తున్న చిన్నారి పెళ్లికూతురు సీరియల్.. ఏ ఛానెల్లో అంటే?

ఉయ్యాల జంపాల సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అవికా గోర్.టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.2008 లో కలర్స్ టీవీ లో బాలికా వధు అనే సీరియల్ లో నటించింది.ఇక ఇదే సీరియల్ తెలుగులో స్టార్ మా లో చిన్నారి పెళ్లి కూతురు గా ప్రసారం అయ్యింది.

 Chinnari Pellikuthuru Telugu Serial Comming Soon As Anandhi In Etv Plus Channel-TeluguStop.com

ఇక ఈ సీరియల్ తో చిన్నారి పెళ్లి కూతురు గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆనంది అనే పాత్రతో అవికా గోర్ చిన్నారి పెళ్లి కూతురు గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Chinnari Pellikuthuru Telugu Serial Comming Soon As Anandhi In Etv Plus Channel-ఆనందిగా మళ్ళీ వస్తున్న చిన్నారి పెళ్లికూతురు సీరియల్.. ఏ ఛానెల్లో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు ప్రసారమైన ఈ సీరియల్ మంచి కథతో తెర మీదికి వచ్చింది.ఇందులో బాల్య వివాహం చేసి ఆ సమయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చక్కగా రూపొందించారు.

ఆడుకునే వయసులో పిల్లలను పెళ్లి చేయడం సరైనది కాదని చూపించారు.బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చక్కని సందేశాన్ని అందించడంతో ఈ సీరియల్ అప్పట్లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సీరియల్ మళ్లీ తెలుగులో మళ్లీ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్నో హిందీ సీరియల్స్ తెలుగు లో డబ్బింగ్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

హిందీ సీరియల్స్ కు హిందీలో కంటే తెలుగు లోనే ఎక్కువ ప్రాధాన్యం పొందిన నేపథ్యంలో ఎక్కువగా తెలుగు లో ప్రసారం అవుతున్నాయి.ఇక తాజాగా చిన్నారి పెళ్లి కూతురు ఆనంది అనే పేరుతో ఈటీవీ ప్లస్ లో ప్రసారం అవుతుంది.

మొత్తానికి మళ్ళీ ఈ సీరియల్ ను ఆనంది పేరుతో ప్రసారం చేయడానికి ప్రకటనలు అందించగా ఈ సీరియల్ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

#Anandhi Serial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు