చిన్నారి పెళ్లి కూతురు బామ్మ మృతి..!

బాలీవుడ్ సీరియల్ యాక్టర్ సురేఖ సిక్రి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.కొన్నాళ్లుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఆమె నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు.75 ఏళ్ల సురేఖ సిక్రి బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లో నటించారు.మూడు సార్లు ఉత్తమ సహాయ నటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.

 Chinnari Pelli Kuturu Fame Actor Surekha Sikri Dies With Heart Attack-TeluguStop.com

షూటింగ్ కోసం మహాబళేశ్వరం లో బాత్రూం లో ఆమె కింద పడ్డారు.ఆ టైం లో ఆమె తలకు బలమైన గాయం తగిలింది.

అయితే ఆ గాయం నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు.

 Chinnari Pelli Kuturu Fame Actor Surekha Sikri Dies With Heart Attack-చిన్నారి పెళ్లి కూతురు బామ్మ మృతి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సురేఖ సిక్రి సీరియల్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె మూడు దశాబ్ధాలుగా ఆమె నటనలో రాణిస్తున్నారు.హిందీలో వచ్చిన బాలికా వధు సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.సీరియల్ యాక్టర్ సురేఖ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపం తెలియచేస్తున్నారు.

 చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారానే హీరోయిన్ అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ సినిమాలో ఆమె నటనకు తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.

అందుకే ఆమెకు తెలుగులో హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి.

#Small Screen #Surekha Sikri #Avika Gor #ChinnariPelli #Heart Attack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు