అతడు జోగిని బిడ్డ..అయినప్పటికి ఆటుపోట్లు ఎదుర్కొని విజేతగా నిలబడ్డాడు  

Chinnaiah Jangam Life Story-

జోగిని .పేరు వింటేనే ముఖం చిట్లిస్తాం..

Chinnaiah Jangam Life Story--Chinnaiah Jangam Life Story-

ఇంక తన పిల్లలంటే ఒక రకమైన ఏహ్యభావం వచ్చేస్తుంది.అలాంటిది ఒక జోగిని కొడుకు ఇప్పుడు విజేతగా నిలబడ్డాడు.

ఈ ప్రపంచంలో తన జీవితం తాలూకూ మచ్చను పోగొట్టుకుని,గౌరవం పొందాలంటే చదువొక్కటే మార్గమనుకున్న తల్లికలను నిజం చేశాడు.జోగిని కొడుకు చదువుకోవడమా .నెవ్వర్ అసంభవం.

కాని ఖండాలు దాటి దేశవిదేశాల్లో చదువుని అభ్యసిందిచ విజేతగా నిలిచాడు.ఒకప్పుడు ఈసడించుకున్న గ్రామప్రజలకు రోల్ మోడల్ అయ్యాడు.అతడే చిన్నయ్య.

జంగం చిన్నయ్య కొమ్మన్ పల్లి ,నిజామాబాద్ జిల్లా సొంతూరు…ప్రస్తుతం ఉంటున్నది కెనడాలో.అక్కడి కార్లెటాన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్.అంతకుముందు లండన్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పిహెచ్ డి పట్టా తీసుకున్నాడు.

ఢిల్లీ యూనివర్సిటిలో ఎమ్ ఫిల్ చేశాడు.జంగం చిన్నయ్య.

తల్లి పేరు చిన్నుబాయ్…తండ్రెవరో తెలియదు…అవును చిన్నయ్య ఓ జోగిని కొడుకు.నాన్నంటే ఎవరో తెలియని అభాగ్యుడు.జోగిని కడుపున పుట్టిన చిన్నయ్యను ఆ మలినం తన కొడుక్కి అంటకూడదంటే చదువొక్కడే మార్గమనుకుంది.

చిన్నయ్య బాగా చదువుకోవాలి…లోకమంతా మురిసిపోవాలి.ఇదీ చిన్నయ్య తల్లి చిన్నుభాయ్ కల…కాని కల తీరాకుండానే లోకం విడిచి వెళ్లిపోయింది.…కొడుకు విజయాలను చూడనియ్యకుండా ఆ తల్లి కన్నుమూసినప్పటికితల్లి ఆశయమే లక్ష్యంగా చిన్నయ్య బతికాడు.అమ్మ జ్ఞాపకమైన చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

బతకడానికి కూలి పని చేశాడు.గమ్యాన్ని చేరడానికి చదువునే ఆయుధంగా చేసుకున్నాడు… చదువు, బోధించు,సమీకరించు…అంబేద్కర్ ఇచ్చిన నినాదామే స్పూర్తి.ఏనాటికైనా ఆ ప్రపంచ మేధావి చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే చదవాలి.టార్గెట్ స్పష్టంగా కనిపిస్తోంది…ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఇంటర్,నాగార్జునసాగర్ లో చిన్నయ్య డిగ్రీ కంప్లీట్ చేశాడు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎమ్.

ఏ హిస్టరీని పూర్తి చేశాడు.ఢిల్లీ జేఎన్ యూలో యంఫిల్ తరువాత ఉస్మానియాలో ఉద్యోగం చేశాడు..

యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో పిహెచ్ .డి సీటు సంపాదించాడు.

ఇంటలెక్చువల్ అండ్ పొలిటికల్ రైటింగ్స్ ఎగైనెస్ట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ (intellectual and political writings of Dalits against caste inequality) సబ్జెక్ట్ ఎంచుకున్నాడు… ఫెలిక్స్ స్కాలర్ షిప్ తో డాక్టరేట్ ను పూర్తిచేశాడు.ఆ తరువాత పోస్ట్ డాక్టరేట్ కోసం అమెరికా వెళ్లాడు.

చిన్నయ్య జీవితంలో ఆయన సహచరి మయూరిక చక్రవర్తి రోల్ చాలా గోప్పది…తన భార్యే తనకు వెన్ను దన్ను అని గర్వంగా చేబుతాడు చిన్నయ్య.

ఢిల్లీ జేఎన్ యులో పరిచయం కాస్తా ప్రేమగా మారి తర్వాత పెళ్లివరకు వెళ్లింది.వీరికి ఓ కొడుకు.

అతని పేరు అభ్యుదయ్ జంగం…తండ్రి లేకుండా బతకడం ఎంత కష్టమో తెలుసు.తండ్రెవరో తెలియకుండా బతకడం ఇంకెంత కష్టం.మన దేశంలో అసలు ఊహకందని విషయం.

చిన్నయ్య తండ్రెవరో తెలిసింది.ఒకరోజు ఒక పెద్దాయననుండి చిన్నయ్యకు పిలుపొచ్చింది.

నేనే నీ తండ్రిని ఈ ముసలి వయసులో నన్నాదుకొమ్మంటూ.చిన్నయ్య సరే అన్నాడు కాని రావడానికి ఒక కండిషన్ పెట్టాడు తనను కొడుకుగా ఒప్పుకోమని.దానికి పెద్దాయన నిరాకరించాడు.

దాంతో అతడి దగ్గరకు వెళ్లడానికి చిన్నయ్య మనసు అంగీకరించలేదు.