విశాఖలో చినబాబు పోరాటం.. ట్విస్ట్ ఏంటంటే..?

కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి చంద్రబాబు, నారా లోకేష్‌లు ఏపీని వదిలేసిన విషయం తెలిసిందే.హైదరాబాద్‌లోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.

 Chinnababu Fighting In Vishaka,  Chandrababu, Nara Lokesh, Amaravathi, Vizag, Ys-TeluguStop.com

అయితే అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఏపీకి వచ్చి వెళుతున్నారు.ఇక మిగతా సమయమంతా సోషల్ మీడియా, జూమ్ యాప్‌లో రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు.

ఇలా చేయడం వల్ల రోజురోజుకూ ఏపీలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది.ప్రజలు టీడీపీని మరిచిపోయే స్టేజ్‌కు వచ్చేశారు.

అసలు సొంత పార్టీ కార్యకర్తలు సైతం చంద్రబాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నారు.సరే చంద్రబాబుకు వయసు మీద పడింది.

మరి చినబాబుకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.టీడీపీకి కాబోయే నాయకుడుగా లోకేష్ ఏపీలో పార్టీని బలోపేతం చేయాలసిన అవసరముంది.

కానీ ఆయన ఎంతసేపు సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, బయట టీడీపీ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు.ఓ యువనాయకుడుగా లోకేష్ ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుంది.

తాజాగా అమరావతి కోసం వచ్చి, రైతుల చేసే పోరాటానికి మద్ధతు ఇచ్చారు.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.అమరావతి కోసం రైతుల ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు.కాబట్టి వారికి మద్ధతుగా నిలిచారు.

అయితే రాష్ట్రంలో అమరావతి ఒక్కటే సమస్య లేదు.పలు జిల్లాలో పలు రకాల సమస్యలు ఉన్నాయి.

అలా సమస్య ఉన్నచోటల్లా పర్యటించి, అక్కడి ప్రజలకు మద్ధతు తెలిపితే పార్టీకు చాలా బెన్‌ఫిట్ ఉంటుంది.

ముఖ్యంగా విశాఖలో ఇంతవరకు పర్యటించలేదు.

పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…విశాఖలో వైసీపీ భూదందాలు చేస్తుందని ట్విట్టర్‌లో కూస్తారు.అదేదో డైరక్ట్‌గా వచ్చి విశాఖలోనే పోరాటం చేస్తే బాగుంటుంది కదా అని అక్కడి తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.

కానీ విశాఖకు వచ్చే ధైర్యం చేయడం లేదు.కేవలం అమరావతి చుట్టూనే తిరుగుతూ, మిగతా ప్రాంతాలని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇలా చేయడం వల్ల పార్టీకే పెద్ద బొక్క పడేలా ఉంది.ఇప్పటికైనా చినబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టాలని తమ్ముళ్ళు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube