వైరల్‌ : దేవుడికి ఇచ్చిన హారతి కళ్లకు అద్దుకోవద్దట  

Chinna jeeyar swamy about harathi in hindu pooja - Telugu Chinna Jeeyar Swamy, Dhanurmasam Pravachanalu, Harathi In Hindu Pooja, Hindu Culture, చిన జీయర్‌ స్వామి, హారతి

దేవుడికి హారతి ఇచ్చిన వెంటనే ఆ హారతిని ప్రతి ఒక్కరు కళ్లకు అద్దుకునేందుకు ఇష్టపడతారు.హారతి తీసుకోవాలంటూ చాలా మంది ఎన్ని పనులు ఉన్నా కూడా హారతి సమయంకు గుడికి వెళ్లడం లేదంటే ఇంట్లో పూజ సమయంకు ఇంటికి చేరుకోవడం చేస్తారు.

Chinna Jeeyar Swamy About Harathi In Hindu Pooja

హారతి అనేది పూజలో చాలా ముఖ్యమైన ఘటం.చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అంతా కూడా హారతి తీసుకుని కళ్లకు అద్దుకుంటారు.దేవుడికి ఇచ్చిన హారతి అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు తీసుకునేందుకు ఎగబడుతారు.

హారతి అనేది దేవుడి ఆశీస్సుల కోసం అంటూ అంతా అనుకుంటారు.

కాని హారతి గురించి ప్రముఖ ఆద్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి వారు కొత్త విషయాలను తెలియజేశారు.హారతిని కళ్లకు అద్దుకోవద్దు అంటూ ఆయన చెబుతున్నాడు.

కర్పూరం లేదా మరేదైనా దీపంతో దేవుడికి హారతి ఇవ్వడం అంటే ఆయనను అలంకరించి, పూజించి, ప్రసాదం పెట్టిన తర్వాత ఎవరి దిష్టి తగలకుండా దిష్టి తీసేది హారతి.అలాంటి దిష్టి దీపంను కళ్లకు అద్దుకోవడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో ధనుర్మానోత్సవ ప్రవచనాల సందర్బంగా భక్తులకు చినజీయర్‌ స్వామివారు ఈ విషయాన్ని తెలియజేశారు.హిందువు అంటే హారతి, హారతిని కళ్లకు అద్దుకోవడం అని ప్రతి ఒక్కరి మదిలో ఉండి పోయింది.అలాంటిది ఇప్పుడు స్వామివారు చెప్పినా కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో ఎవరు లేరు.హారతి కళ్లకు అద్దుకుంటేనే అసలైన పూజ పరిసమాస్తం అయినట్లుగా భక్తులు భావిస్తున్నారు.అందుకే గుడిలో కూడా హారతి ఇస్తూ ఉంటారు.మరి హారతి విషయంలో ముందు ముందు మత పెద్దలు, హిందూ ధర్మ పండితులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

#Hindu Culture #హారతి

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Chinna jeeyar swamy about harathi in hindu pooja Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL