వైరుముత్తుకి ఒక న్యాయం.. బ్రిజ్ భూషణ్ కి మరో న్యాయమా... సీఎంని ప్రశ్నించిన చిన్మయి?

సింగర్ చిన్మయి (Chinmayi) రచయిత వైరముత్తు (Vairumuthu) మద్య ఎలాంటి వివాదం చెలరేగిందో మనకు తెలిసిందే.అయితే ఈ వివాదం ఇంకా సద్దుమనగ లేదని తెలుస్తోంది.

 Chinmayi Wants Mk Stalin To Take Action Against Vairamuthu Details,chinmayi,vair-TeluguStop.com

తనకు అవకాశం దొరికిన ప్రతిసారి చిన్మయి వైరముత్తుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.వైరముత్తు అనేక మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది.

అయితే తాజాగా మరోసారి ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ సింగర్ చిన్మయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Tamilanadu Cm Stalin) విన్నవించుకున్నారు.బ్రిజ్‌ భూషణ్‌(Briz Bushan) తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్ తోపాటు ఒక మైనర్‌ సైతం వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Telugu Briz Bushan, Chinmayi, Kamal Hassan, Mee, Tamilanaducm, Vairumuthu, Wrest

ఈ క్రమంలోనే ఇతను పై చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెళ్లి వెతుతున్నాయి.ఇక ఈ విషయంపై నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) కూడా స్పందించడంతో చిన్మయి కమల్ హాసన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అయితే తాజాగా ఈ విషయంపై ఈమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా చిన్మయి ట్వీట్ చేస్తూ బ్రిజ్‌ భూషణ్‌కైనా, వైరముత్తుకైనా రూల్స్ ఒకేలా ఉండాలి.

ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరోలా ఉండకూడదని తెలిపారు.

Telugu Briz Bushan, Chinmayi, Kamal Hassan, Mee, Tamilanaducm, Vairumuthu, Wrest

వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17మంది మహిళలు బహిరంగంగానే వెల్లడంచాం.దాంతో ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మాకు ఉన్న కళతో పోలిస్తే తనకు ఉన్న టాలెంట్ పెద్ద గొప్పేమీ కాదు.

దయచేసి వైరు ముత్తు లాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ముఖ్యమంత్రిని కోరుతూ ట్వీట్ చేశారు.ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే తమిళనాడులో కొన్ని పని ప్రదేశాలు చాలా సేఫ్ గా ఉంటాయని చిన్మయి పేర్కొన్నారు.

ఇలా వైరు ముత్తుపట్ల చర్యలు తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రిని కోరుతూ చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube