కోర్టు తీర్పుపై చిన్మయి, తాప్సి అసహనం..!- Chinmayi Tapsi Impatient Over Court Verdict

Chinmayi and tapsee impatient over court verdict, Chinmayi, taapsee Twitter, mumbai high court, un satisfied, judgement - Telugu Heroin Thapsi, Judgement, Mumbai High Court, Singer Chinmayi, Un Satisfied

లైంగిక వేధింపుల కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సింగర్‌ చిన్మయి శ్రీపద, సినీ నటి తాప్సికి తీవ్ర నిరాశ ఎదురైంది.దీనిపై సింగర్‌ చిన్మయి శ్రీపద, నటి తాప్సి పన్ను ట్విట్టర్‌ వేదికగా హైకోర్టు తీర్పుపై అసహనాన్ని వ్యక్తం చేశారు.

 Chinmayi Tapsi Impatient Over Court Verdict-TeluguStop.com

ఇలాంటి తీర్పు విన్న తర్వాత మాటలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌ పాల్‌ అనే వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వివాదాస్పద అంశంపై గాయని చిన్మయి, తాప్సీ ఘాటుగా స్పందించారు.

 Chinmayi Tapsi Impatient Over Court Verdict-కోర్టు తీర్పుపై చిన్మయి, తాప్సి అసహనం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జూన్‌ పాల్‌ ట్విట్‌ కు ఆమె రీట్విట్‌ చేశారు.ఈ సందర్భంగా చిన్మయి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది.అద్భుతంగా ఉంది కదూ.? ఈ దేశం లైంగిక వేధింపులకు పాల్పడే వారి కోసమే అంటూ తన భావాన్ని వ్యక్త పరిచింది.వీటితో పాటు వేధింపులకు పాల్పడే వారి కోసమే చట్టాలను ఏర్పాటు చేసుకున్నారు.అంటూ రిట్వీట్‌ చేశారు.దీంతో ఈ ట్విట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

చిన్మయితో పాటు నటి తాప్సి కూడా జూన్‌ పాల్‌ ట్విట్‌ ను రీట్విట్‌ చేశారు.

ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ఉన్న మహిళల వేధింపులపై చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాను కానీ ఇలాంటి తీర్పు విన్న తర్వాత మాటలు రావడం లేదు అని చెప్పుకొచ్చారు.

రెండు రోజుల కిందట లైంగిక వేధింపుల విషయంపై ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది.

మహిళ శరీరానికి తాకితేనే అది లైంగిక వేధింపుల కిందికి వస్తుందని, ఆమె దుస్తులకు తాకితే అది లైంగిక వేధింపుల కిందికి రాదని సంచలన తీర్పునిచ్చింది.సింగిల్‌ జడ్జి న్యాయమూర్తి పుష్ప గనేదివాల అధ్యక్షతన ఈ తీర్పు వెలువడింది.

మైనర్‌ బాలికల విషయంలో వారి ఎద భాగాన్ని తాకినంత మాత్రాన అది లైంగిక వేధింపుల కిందికి రాదని, దుస్తువులు లేకుండా మైనర్ల శరీర భాగాన్ని తాకినప్పుడే అది లైంగిక వేధింపుల పరిగణించాలని తీర్పు వెలువరించింది.

#Singer Chinmayi #Un Satisfied #Judgement #Heroin Thapsi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు