నా కూతురును గదిలోకి పిలిచాడు.. అందుకు వేరే వారిని చూసుకోమని చెప్పా  

తమిళ సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు అయిన చిన్మయి కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక దాడిని బయట పెట్టడంతో పాటు మీటూ ఉద్యమంను ప్రారంభించింది. ఆమీటూ ఉద్యమంలో నేను సైతం అంటూ చిన్మయి పాలుపంచుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే తనపై జరిగిన లైంగిక వేదింపులను మరియు లైంగిక దాడిని చిన్మయి చెప్పుకొచ్చింది. తమిళ దిగ్గజ రచయిత, పద్మ అవార్డు గ్రహీత వైరముత్తుపై చిన్మయి చేసిన లైంగిక ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Chinmayi Sripada's Mom Opens Up About Vairamuthu Harassment-

Chinmayi Sripada's Mom Opens Up About Vairamuthu Harassment

సౌత్‌ ఇండియా మొత్తం ప్రస్తుతం ఈ విషయమై చర్చించుకుంటున్న నేపథ్యంలో చిన్మయి తల్లి పద్మాసిని మీడియా ముందుకు వచ్చారు. తన కూతురుపై లైంగిక దాడికి తన ముందే ప్రయత్నం జరిగిందని ఆమె పేర్కొంది. వైరముత్తుపై ఈమె కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. 2004వ సంవత్సరంలో స్విర్జల్యాండ్‌కు నేను, చిన్మయి కలిసి ఒక ఆడియో వేడుక కోసం వెళ్లాము. అక్కడకు వైరముత్తు కూడా వచ్చారు. ఆయన్ను కలిసి మాట్లాడే ఛాన్స్‌ ఇస్తామని నిర్వాహకులు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కూడా అక్కడే మమ్ములను ఉంచారు.

కార్యక్రమం అంతా పూర్తి అయ్యి, ఎక్కడి వారు అక్కడకు వెళ్లిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి వైరముత్తు గారు పిలుస్తున్నారు, ఆయన రూంలో వెయిట్‌ చేస్తున్నారు అంటూ చెప్పాడు. అప్పుడు ఇద్దరం వెళ్లబోగా చిన్మయి గారు ఒక్కరే వెళ్లాలి, మీరు ఇక్కడే ఇంకాస్త సమయం వెయిట్‌ చేయండి అన్నాడు. అదేంటి రహస్య భేటీ, అలాంటి భేటీలు మాకు అలవాటు లేదు, అలాంటి వాటి కోసం మరెవ్వరినైనా చూసుకోండి అంటూ అక్కడ నుండి వెళ్లి పోబోయాం, ఆ సమయంలో కొద్ది సమయం మీరు సహకరించండి అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. దాంతో నాకు కోపం వచ్చి అతడిని నెట్టేసి చిన్మయితో నేను వచ్చేశాను అంది.

Chinmayi Sripada's Mom Opens Up About Vairamuthu Harassment-

మొత్తానికి వైరముత్తు ఇన్నాళ్లు తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద మనిషిగా చలామని అవుతూ వచ్చాడు. కాని ఇప్పుడు ఒక్కసారిగా తల్లి కూతుర్లు ఆయన స్థాయిని దిగజార్చేలా మాట్లాడారు. ఇప్పుడు ఆయన గురించి తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.