అవన్నీ తప్పుడు వార్తలే.. వాళ్లపై ఫైర్ అయిన చిన్మయి..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు చిన్మయి.దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్న సంగతి తెలిసిందే.

 Chinmayi Sripada About Vaccinated In During Periods, Chinmayi Sripada , Corona V-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలను భయపెడుతున్నాయి.

రోజుకు ప్రస్తుతం మూడు లక్షలకు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతుండగా రాబోయే రోజుల్లో రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ప్రచారం జరుగుతోంది.చాలామంది మహిళలు ఈ ఫేక్ న్యూస్ ను నమ్మి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

Telugu Corona Vaccine, Periods-Movie

ప్రముఖ గైనకాలజిస్ట్ సహాయంతో చిన్మయి వైరల్ అవుతున్న ఫేక్ వార్తలకు చెక్ పెట్టారు.నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే ఏమీ కాదని ఆమె వెల్లడించారు.నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే నెలసరి సైకిల్ కు ప్రమాదమంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. చిన్మయి వ్యాక్సిన్ పై నెలకొన్న అపోహలు తొలగించడానికి చేసిన ప్రయత్నాన్ని మహిళలు అభినందిస్తున్నారు.

తాము నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నామని తమకు ఎలాంటి ప్రమాదం కలగలేదని కొందరు మహిళలు చెప్పారు.మరి కొందరు మహిళలు వ్యాక్సిన్ పై అపోహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసినందుకు చిన్మయికి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ ను చాలామంది వేయించుకోవాలని భావిస్తున్నా ఈ ఫేక్ వార్తలు వాళ్లలో భయాందోళనకు కారణమవుతున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ ను తీసుకుంటే మాత్రమే వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube