స్కైప్ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయ్!

చిన్మయ్ శ్రీపాద.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Singer Chinmayi Sripada Sensational Comments On Sophia Akkara, Singer Chinmayi S-TeluguStop.com

ఎంతో అద్భుతమైన గొంతుతో మధురంగా పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.అంతేకాకుండా సమంతకు ప్రత్యేక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది.

పాటలు పాడుతూ, డబ్బింగ్ చెబుతూ తన కెరీర్ లో ఎంతో ముందుకు సాగుతున్న తరుణంలో మీటూ ఉద్యమంలో కొన్ని నిజాలు బయట పెట్టి కోలీవుడ్ కు పూర్తిగా దూరం అయ్యింది చిన్మయి.
స్విట్జర్లాండ్ లోని సోఫియా అక్కర మన దేశంలో జరిగన మీటు ఉద్యమం సంగతి తెలియకుండానే గత ఏడాది ఓ సంఘటనను షేర్ చేసింది.

ఆ సంఘటనను చిన్మయి పోస్ట్ చేసింది.సోఫియా అక్కర చెప్పిన కథనం ప్రకారం తనకు 18 ఏళ్లు ఉన్నప్పుడు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గా అవకాశం వచ్చిందని చెప్పింది.

ఇక ఒకరోజు అతను స్కైప్ ఐడి అడిగినప్పుడు క్యాజువల్ గా అనిపించి ఇచ్చింది అని.ఆయన ఉన్నట్టుంది ఆమెకు స్కైప్ కాల్ చేసి కెమెరా ముందు బట్టలూడదీసి నగ్నంగా కనిపించమని అడిగినప్పుడు అతని మీద ఉన్న గౌరవం మొత్తం పోయిందని చెప్పుకొచ్చింది.

ఆయనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని నాతో ఇలా ప్రవర్తించడంతో షాక్ అయ్యాను అని చెప్పారు.పోలీసులకు ,మీడియాకు చెప్తాను అన్న భయం కూడా లేకుండా, నువ్వు చెప్పినా ఎవరునమ్మరు.

అన్న విధంగా ప్రవర్తించాడని సోఫియా చెప్పినట్లు చిన్మయి వివరించారు.ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇలాంటి మానవమృగాలు నుంచి బాధపడుతుంటే సామాన్యుల పరిస్థితి వర్ణనాతీతమని, సోఫియా అక్కర విషయంలో జరిగిన ఈ సంఘటన నాకు ఒక గుణపాఠంలా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ సంఘటన ఆమె కళ్ళు తెరిపించిందని, ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చిన్మయి తెలిపారు.సోఫియా తనకు జరిగిన సంఘటనలను పోస్ట్ చేయడం వల్ల ఎంతో మంది ఆడపిల్లలకు ఇలాంటి మృగాల నుంచి అవగాహన కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ ను తిరిగి చిన్మయి రీ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube