ఇంట్లో వాళ్లే ఆ దృష్టితో చూస్తున్నారు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు..?

టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపును సంపాదించుకున్న చిన్మయి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాల గురించి స్పందిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.సమాజంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఇబ్బందుల గురించి చిన్మయి ధైర్యంగా నిలబడి ప్రశ్నిస్తున్నారు.

 Chinmayi Sensational Comments About Present Society-TeluguStop.com

మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సాధారణ యువతులు తనకు పంపిన సందేశాల గురించి కూడా స్పందించే చిన్మయి ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడంతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ప్రశ్నిస్తున్నారు.

 Chinmayi Sensational Comments About Present Society-ఇంట్లో వాళ్లే ఆ దృష్టితో చూస్తున్నారు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక యువతి తన తల్లిదండ్రులే తనను వేశ్యగా చూస్తున్నారంటూ తనకు ఎదురైన అనుభవాలను చిన్మయితో చెప్పుకోగా ఆ యువతి ఆవేదన గురించి చిన్మయి వెల్లడించారు.

ఒక యువతి ఆరోగ్య సమస్యలు, వేర్వేరు కారణాల వల్ల పీరియడ్స్ ను బ్రేక్ చేసినా కన్నతల్లి నుంచే దారుణమైన ప్రశ్నలు ఎదురు కావడంతో ఆ యువతి మనోవేదనకు గురై చిన్మయికి ఇంట్లో వాళ్లే తన గురించి తప్పుగా అనుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

కుటుంబ సభ్యులే అమ్మాయిలను నిందించడం సరికాదని చిన్మయి పేర్కొన్నారు.ఖచ్చితంగా ఇలాంటి విషయాలను తిప్పికొట్టాలని చిన్మయి పేర్కొన్నారు.

తల్లీ తండ్రి గురువు దైవం అని చెప్పే మాటలలో మహిళలను గొప్పగా చిత్రీకరించారని కానీ రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను కట్టిపడేస్తున్నారని చిన్మయి వెల్లడించారు.అమ్మాయిలు భర్తను ఎంచుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్మయి పేర్కొన్నారు.

చిన్మయి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్మయి చేసిన ట్వీట్లకు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ప్రజల ఆలోచనల్లో, సమాజంలో మార్పు రావాల్సి ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

#Chinmayi #Parents Rules #Present Society

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు