అలాంటప్పుడు పిల్లల్ని కనవద్దు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు..?

సింగర్ చిన్మయికి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్యగా మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పడం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Star Singer Chinmayi Sensational Comments About Parenting, Chinmayi, Chinmayi Po-TeluguStop.com

చిన్మయి గాత్రాన్ని అభిమానించే నెటిజన్లు చాలామందే ఉన్నారు.పలు వివాదాల ద్వారా గతంలో వార్తల్లో నిలిచిన చిన్మయి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారిలో చిన్మయి ఒకరనే సంగతి తెలిసిందే.మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాల ద్వారా వార్తల్లో నిలిచిన చిన్మయి వైరముత్తు గురించి సంచలన ఆరోపణలు చేశారు.

మహిళలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను చిన్మయి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నారు.తాజాగా చిన్మయి ఒక మహిళ భర్త స్నేహితుల ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Chinamyi, Chinmayi, Rahul Ravindran, Mee, Mentality, Samantha-Movie

తన భర్త ఫ్యామిలీకి సమయం కేటాయించడంతో పాటు బాధ్యతలను సమానంగా పంచుకుని సహాయసహకారాలను అందిస్తారని భర్త కొడుకును తనకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారని అయితే అతని ఫ్రెండ్స్ మాత్రం భార్యపై భయంతో తన భర్త అలా చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారని పిల్లలను పెంచే, చూసుకునే బాధ్యత భర్తకు లేదా అని ఆ మహిళ చిన్మయిని అడిగారు.

Telugu Chinamyi, Chinmayi, Rahul Ravindran, Mee, Mentality, Samantha-Movie

చిన్మయి ఆ ప్రశ్నకు బదులిస్తూ తండ్రి పిల్లాడిని ప్రేమగా చూసుకుంటే భార్యకు భయపడి అలా చేస్తున్నాడని అనుకోవద్దని మంచి తండ్రిగా ఉండటం ఆ వ్యక్తి ఉద్దేశమని చెప్పుకొచ్చారు.ఆమె భర్తకు ఉన్న స్నేహితులే మీకు కూడా ఉంటే వారి బుద్ధిని మార్చే ప్రయత్నం చేయాలని చిన్మయి సూచించారు.తల్లిదండ్రులలో ఒక్కరే బాధ్యతలను చూసుకోవాలని ఎవరైనా అనుకుంటే అలాంటి వాళ్లు పిల్లల్ని కనవద్దని చిన్మయి పేర్కొన్నారు.చిన్మయి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube