అది బ్రా కాదు..తనపై నీచమైన కామెంట్స్ చేసినవారికి 'చిన్మయి' స్ట్రాంగ్ కౌంటర్.! అసలేమైంది?   Chinmayi Reacts On Bad Memes On Her Dress     2018-10-30   09:58:33  IST  Sainath G

చిన్మయి…మంచి సింగర్ కంటే సమంత కి వాయిస్ ఇచ్చిన సింగర్ అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. ‘ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పి సమంత కి కుర్రకారులు ఫ్లాట్ అవ్వడానికి పరోక్షంగా కారణంగా మారింది చిన్మయి. తర్వాత హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లిచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండవుతున్న #MeToo‌లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్న విషయం అందరికి తెలిసిందే. మన దగ్గర శ్రీరెడ్డి లాగా అక్కడ చిన్మయి అందరి భాగోతాన్ని బయటపెడుతోంది.మీటూపై సింగర్ చిన్మయి‌కి పలువురు తమిళ సెలబ్రిటీలు, మహిళా సంఘాలు మద్దతు ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు తమిళ జనాలు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ విషయంలో విమర్శలు చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

సింగర్ అంటే ఇలా చీర కట్టుకుని పద్దతిగా ఉండాలి అంటూ చిన్మయి మీద…. సోషల్ మీడియాలో మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో చీరకట్టులో ఉన్న పలువురు సింగర్స్ ఓ వైపు, టీ షర్టులో ఉన్న చిన్మయి ఫోటో మరో వైపు పెట్టి మీమ్స్ క్రియేట్ చేశారు.

Chinmayi Reacts On Bad Memes Her Dress-

ఆ ఫోటోలో చిన్మయి తన బ్రా స్ట్రిప్స్ బయటకు కనిపించేలా అసభ్యంగా డ్రెస్సింగ్ వేసుకుందంటూ సర్కిల్ చేసి మరీ చూపించారు. నువ్వు ఎవరితో అయినా పడుకోవడానికి సిద్ధంగా ఉంటావు అంటూ నీచమైన కామెంట్స్ చేశారు.

Chinmayi Reacts On Bad Memes Her Dress-

వీటిపై చిన్మయి స్పందించి ట్వీట్ చేసారు. నేను ‘బ్రా’ లేస్ కనిపించేలా డ్రెస్సింగ్ చేసుకున్నట్లు సర్కిల్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అది బ్రా కాదు. మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం ధరించే షోల్డర్ బ్రాస్…. అని చిన్మయి స్పష్టం చేశారు. ముందు మగాళ్ల ఆలోచన తీరులో మార్పు వచ్చినపుడే మహిళలపై లైంగిక వేధింపులు తగ్గుతాయని అన్నారు.