చిన్మయికి ఆఫర్‌ ప్రకటించిన యూనియన్‌... ఈమె ఓకే చెప్పేనా?

తమిళ సినీ పరిశ్రమలో చిన్మయి వర్క్‌ చేయకుండా కొందరు కుట్ర పన్నుతున్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.తన కెరీర్‌ను నాశనం చేసేందుకు కొందరు కంకణం కట్టుకుని మరీ ప్రయత్నాలు చేస్తున్నారని చిన్మయి ఆమద్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Chinmayi Gets Offer From Dubbing Artist Union-TeluguStop.com

మీటూ అంటూ ఆమద్య తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై చిన్మయి చేసిన సంచలన వ్యాఖ్యల కారణంగా ఆమెను డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుండి తొలగించారు.దాంతో ఆమె గత కొన్ని రోజులుగా తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తూనే సోషల్‌ మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది.

చిన్మయిని డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌లో జాయిన్‌ చేసుకునేందుకు ఓకే చెప్పారు.అయితే చిన్మయి డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ లో రీ జాయిన్‌ అయ్యేందుకు 1.5 లక్షల జరిమానా కట్టడంతో పాటు, ఆమె అసోషియేషన్‌కు మరియు అసోషియేషన్‌ అధ్యక్షుడు రాధా రవికి క్షమాపణలు చెప్పాలంటూ కండీషన్‌ పెట్టారు.అయితే కండీషన్స్‌కు మాత్రం చిన్మయి మండి పడుతోంది.12 సంవత్సరాలుగా తన నుండి వసూళ్లు చేసిన డబ్బు కాకుండా మళ్లీ ఇప్పుడు నేను 1.5 లక్షలు ఎందుకు కట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మామూలుగా అయితే డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సభ్యత్వం తీసుకునేందుకు 2500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.కాని నాకు మాత్రం 1.5 లక్షల జరిమానా ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.తనను కండీషన్‌ లేకుండా, జరిమానా లేకుండా సభ్యత్వం ఇవ్వాలంటూ చిన్మయి కోరుతోంది.

ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పను అంటూ తేల్చి చెప్పింది.లక్షన్నర రూపాయలు తాను ఎందుకు చెల్లించాలంటూ తమిళ సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రశ్నించాలని చిన్మయి కోరింది.

మరి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.చిన్మయి తగ్గి క్షమాపణ చెబుతుందా లేదంటే అసోషియేషన్‌ వెనక్కు తగ్గుతుందా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube