సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత మంచి కంటే చెడు ఎక్కువగా అందరికీ వ్యాప్తి చెందుతుంది.ఏ విషయం అయినా కొందరు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎన్నో వివాదాలను సృష్టిస్తుంటారు.
ఇలా ప్రతి ఒక్కరి పై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు.వృత్తి పరమైన విషయాలను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పలువురిని కించపరిచే లా మాట్లాడుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ తన కూతురి గురించి అసభ్యంగా మాట్లాడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఎంతో నిరాశ చెందిన ఓ వ్యక్తి తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తన కూతురి పట్ల ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ దుర్భాషలాడటం సంచలనంగా మారింది.
కేవలం తొమ్మిది నెలలు కూడా పూర్తి కాని ఓ చిన్నారిని రేప్ చేస్తానని హైదరాబాద్ కి చెందిన 23 సంవత్సరాల ఓ కుర్రాడు మాట్లాడటం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.ఇలా కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించడంతో పోలీసులు వెంటనే ఆ యువకుడిని అరెస్టు చేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సింగర్ చిన్మయి ఎంతో షాక్ అయ్యారు.ఆ వ్యక్తి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోహ్లీ కూతురు వయస్సు సరిగ్గా తెలియక చిన్మయి రెండు సంవత్సరాల పాప అని చెప్పినప్పటికీ తర్వాత తనకు కేవలం తొమ్మిది నెలల వయసు అని తెలుసుకున్న చిన్మయి అంత చిన్న పాపకు ఇలాంటి బెదిరింపులు చేయడం ఎంతో అవమానకరమని తెలియజేశారు.అడ్డ గాడిదల ఎదిగిన ఆ వ్యక్తి ఓ చిన్న పాపని రేప్ చేస్తానని ఎలా బెదిరిస్తాడు ఆ పసి పాపను కూడా ఒక ఆడదాని శరీరమని భావిస్తున్నాడు అంటూ చిన్మయి ఆ చిన్నారి పట్ల చేసిన వ్యాఖ్యలకు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.