ప్రముఖ రచయితపై లైంగిక ఆరోపణలు, తాతలా భావించాను, కాని!  

తమిళంలో దిగ్గజ రైటర్‌, ఆయన్ను తమిళనాట ది లెజెండ్‌ రైటర్‌ అని కూడా అంటారు. తమిళ సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఆయన కలంకు తలొగ్గాల్సిందే. తమిళ సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు, అలాంటి రచయిత వైరముత్తుపై ప్రముఖ సింగర్‌ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌ లో తనూశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక దాడి గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా పలువురు పలు రకాలుగా తమపై జరిగిన లైంగిక దాడిని మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు.,

Chinmayi Comments On Vairamuthu-

Chinmayi Comments On Vairamuthu

తాజాగా సింగర్‌ చిన్మయి తన చిన్నతనంలో, యుక్త వయసులో, సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించిన సమయంలో ఎదురైన సంఘటనలను చెప్పుకొచ్చింది. ఇలాంటి సంఘటనలు ఎంతో మందికి ఎదురయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడైతే లైంగిక ఆరోపణల గురించి బయటకు చెప్పిందో, అప్పుడే ఆమె వద్దకు వచ్చిన స్నేహితులు తమకు జరిగిన అన్యాయంను చెప్పారు. ఎంతో మంది సింగర్స్‌కు వైరముత్తు నుండి లైంగిక వేదింపు ఎదురయ్యాయట.

Chinmayi Comments On Vairamuthu-

ఈ విషయాన్ని చిన్మయి సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. ఒక సింగర్‌ ను పర్సనల్‌గా ఒక హోటల్‌ లో కలిసేందుకు రమన్నాడట. ఆమె తన వైరముత్తు తాతగారి వయసున్న వ్యక్తి అవ్వడంతో ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా వెళ్లిందట. ఆ సమయంలో ఆయన అనుచితంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడట. దాంతో ఆమె షాక్‌ అయ్యి అక్కడ నుండి వెళ్లి పోయిందట. ఇలా ఎంతో మంది వైరముత్తుపై ఆరోపణలు చేస్తున్నారు.

వైరముత్తు మాత్రం తనపై ఆరోపణలను కొట్టి పారేస్తున్నాడు. ఈమద్య కాలంలో ప్రముఖ వ్యక్తుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం కామన్‌ అయ్యిందని, ఈ ఆరోపణలపై నేను స్పందించను, కాలమే వారికి సమాధానం ఇస్తుందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఏ పరిశ్రమలో అయినా కూడా ఛాన్స్‌లు కావాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని వదులుకోవాల్సిందే అంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.