అతడి గుట్టు రట్టు చేసి, పరువు తీసిన చిన్మయి  

Chinmayi About Radha Ravi-chinmayi,radha Ravi

సింగర్‌ చిన్మయి సంచనాలకు మారు పేరుగా నిలుస్తుంది. ఈమద్య కాలంలో మీటూ ఉద్యమంలో భాగంగా ఆమె తమిళ దిగ్గజాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. లెజెండ్‌ రైటర్‌ వైరముత్తుపై ఈమె సంచలన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రాధ రవిపై కూడా ఈమె మీటూ ఆరోపణలు చేసింది. డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న రాధ రవి తాజాగా చిన్మయిని డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుండి తప్పించడం జరిగింది.

Chinmayi About Radha Ravi-Chinmayi Ravi

Chinmayi About Radha Ravi

తనను అసోషియేషన్‌ నుండి తప్పించడంతో చిన్మయి రెచ్చి పోతుంది. అప్పటి నుండి కూడా రోజు ఏదో ఒక విధంగా రాధరవిని టార్గెట్‌ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. అతడిపై తాజాగా మరోసారి విరుచుకు పడినది. కూతురు వయస్సు ఉన్న అమ్మాయిలను ఎంతో మందిని ఆయన నీచంగా వాడుకున్నాడని, ఆయన ప్రవర్తనతో ఎంతో మంది హీరోయిన్స్‌ ఇబ్బంది పడ్డారని అంది. ఇక తనకు తాను గొప్ప వ్యక్తిని అంటూ ఆయన చెప్పుకుంటాడంటూ ఆరోపణలు చేసింది.

Chinmayi About Radha Ravi-Chinmayi Ravi

మలేషియన్‌ ప్రభుత్వం దత్తో అనే బిరుదు ఇచ్చింది అంటూ రాధ రవి ప్రచారం చేసుకుంటున్నాడు. కాని అది వాస్తవం కాదు అంటూ చిన్మయి నిరూపించింది. అసలు రాధా రవికి మలేషియన్‌ ప్రభుత్వం ఎలాంటి బిరుదు ఇవ్వలేదు అంటూ చిన్మయి సాక్ష్యాలను కూడా సమర్పించింది. మలేషియన్‌ ప్రభుత్వం ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. తాము ఎవరికి ఆ బిరుదు ఇవ్వలేదు అంటూ ప్రకటించింది. తనను సభ్యత్వం నుండి తొలగించినందుకు గాను రాదారవిని ఇష్టం వచ్చినట్లుగా చిన్మయి ఆడేసుకుంటుంది.