మరోసారి వార్తల్లో నిలిచిన చిన్మయి!  

Chinmai Again Sensational Comments On Radha Ravi - Telugu Chinmai, Radha Ravi, Tamil Heroine, Telugu Viral News Updates, Viral In Social Media, చిన్మయి

గాయని చిన్మయి ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు.ఈ నేపథ్యంలోనే చిన్మయి మరోసారి వార్తల్లో నిలిచారు.

Chinmai Again Sensational Comments On Radha Ravi - Telugu Chinmai, Radha Ravi, Tamil Heroine, Telugu Viral News Updates, Viral In Social Media, చిన్మయి-Movie-Telugu Tollywood Photo Image

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.గతంలో రాధారవి అనే సీనియర్ నటుడుపై చిన్మయి మీటూ అరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే అతను 10 రోజుల క్రితం డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఆ సమయంలో రాధారావికి పోటీగా చిన్మయి కూడా నామినేషన్ వేసింది.

అయితే కొన్ని కారణాల వల్ల అనుకోని రీతిలో చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే చిన్మయి ఏమాత్రం తగ్గకుండా నామినేషన్ తిరస్కరణపై కోర్టుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యింది.

అయితే ఇది అంత పక్కన పెడితే.

రాధారవి ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడుతూ.చిన్మయి క్షమాపణలు చెబితే, డబ్బింగ్ కళాకారుల సంఘంలో తిరిగి చేర్చుకుంటానని వ్యాఖ్యానించారు.అయితే ఆ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి.

ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు.తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, తాను గతంలో చేసిన విమర్శలకు కట్టుబడే ఉన్నానని ఆమె బదులిచ్చారు.

దీంతో ప్రస్తుతం చిన్మయి మరోసారి వార్తల్లో నానుతుంది.

తాజా వార్తలు