టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న దేశీ యాప్

సరిహద్దులో భారత్ సైనికులపై చైనా దాడి చేసి 20 మందిని పొట్టన పెట్టుకుంది.ఈ ఘటన తర్వాత చైనాపై భారత్ ప్రజలకి విపరీతమైన ద్వేషం పెరిగిపోయింది.

 New App Chingari Come To Limelight, Social Media, Tiktok, Banchina, Indian Gover-TeluguStop.com

ఈ ద్వేషంతో చైనా వస్తువులని, చైనా యాప్ లని బహిష్కరించాలనే డిమాండ్ పెరిగింది.సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నడుస్తుంది.

దీనికి మద్దతు ఇస్తూ చాలా మంది చైనా యాప్ ని డిలేట్ చేస్తున్నారు.అలాగే వస్తువులు కూడా దగ్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చైనా యాప్ అయిన టిక్ టాక్ కి ఇండియాలో విపరీతమైన ఆదరణ ఉంది.ఇప్పుడు ఈ ప్రభావం ఈ యాప్ మీద కూడా పడింది.

దీనిని అన్ ఇన్స్టాల్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

అదే సమయంలో టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్ ల గురించి సెర్చింగ్ ఎక్కువ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో చింగారీ అనే దేశీయ యాప్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఆ యాప్ సృష్టికర్తలు చెబుతున్నారు.జూన్ 10 నాటికి లక్ష డౌన్ లోడ్లు సాధించిన ఈ యాప్ గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేవలం మూడ్రోజుల వ్యవధిలో 5 లక్షల డౌన్ లోడ్లు సాధించిందని రూపకర్తలు సిద్ధార్థ్, బిశ్వాత్మ తెలిపారు.

టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో ఉందని వెల్లడించారు.చింగారీ యాప్ లో వ్యూస్ ఆధారంగా వీడియోలపై యూజర్లు డబ్బు సంపాదించుకోవచ్చని సిద్ధార్థ్, బిశ్వాత్మ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube