డౌన్లోడ్స్‌ లో దూసుకెళ్తున్న చింగారి యాప్‌… ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారంటే…?!  

Chingari AppGetting Famous, chingari, china, india, tik tok, pubg, short video platform - Telugu China, Chingari, Chingari Appgetting Famous, India, Pubg, Short Video Platform, Tik Tok

భారత్-చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం కారణంగా, అలాగే భారత దేశ ప్రజల యొక్క పర్సనల్ సమాచారాన్ని చైనా దేశానికి చెందిన అనేక యాప్స్ ను భారతదేశ ప్రభుత్వం నిషేధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన టిక్ టాక్, అలాగే పబ్ జి ఆటను కూడా భారతదేశ ప్రభుత్వం ఇండియాలో నిషేధించింది.

TeluguStop.com - Chingari App Downloads Famous Countries

ఇలా చేయడం ద్వారా భారతదేశంలోని అనేక యాప్స్ బాగా ప్రాచుర్యం చెందాయి.ఇప్పుడు ఆ కంపెనీలన్నీ లక్షలకు లక్షలు డౌన్లోడ్స్ సొంతం చేసుకుంటున్నాయి.

ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది చింగారి యాప్.ఈ యాప్ లో కూడా టిక్ టాక్ లాగా ఏకంగా 30 సెకండ్స్ పాటు షార్ట్ వీడియోను రూపొందించవచ్చు.

TeluguStop.com - డౌన్లోడ్స్‌ లో దూసుకెళ్తున్న చింగారి యాప్‌… ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ షాట్ వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫామ్ యాప్ ప్రస్తుతం 30 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ను దాటేసింది.ఇదంతా కేవలం చింగారి యాప్ మూడు నెలల్లోనే ఈ ఘనతను పొందింది.

ఈ ఉత్సాహంతో మరింత కొత్త ఫీచర్లను యాడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొంటోంది.

ఇక ఈ యాప్ సంబంధించి కొత్తగా ఫ్రంట్ అలాగే రియర్ కెమెరాల సాధనాలను అందించడానికి ఆగ్మెంటేడ్ రియాలిటీ ఫిల్టర్ ను కూడా చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలియజేశారు.

ఇక ఈ యాప్ ను ఎక్కువగా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఎక్కువగా వాడుతూ ఉండడం విశేషం.ప్రస్తుతం చింగారి యాప్ లో స్థానిక భాషలు హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ, ఒడియ భాషలలో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్ భాషలతో కూడిన కంటెంట్ అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ యాప్ కు కేవలం భారత్ లో మాత్రమే కాకుండా అమెరికా, కువైట్, సింగపూర్, వియత్నాం, సౌదీ అరేబియా దేశాలలో కూడా మంచి ఆదరణ లభిస్తోందని తెలుస్తోంది.

#Chingari #India #ShortVideo #Tik Tok #Pubg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chingari App Downloads Famous Countries Related Telugu News,Photos/Pics,Images..