ట్రంప్ రిసార్ట్‌లోకి అక్రమంగా ప్రవేశం: చైనా జాతీయురాలికి జైలు శిక్ష

ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్ వద్ద నిబంధనలు అతిక్రమించినందుకు గాను చైనా జాతీయురాలికి కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.

 Chinese Woman Trespassing At Trumps Maralago-TeluguStop.com

వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది మార్చి 30న షాంఘైకు చెందిన 33 ఏళ్ల వ్యాపారవేత్త యుజింగ్ జాంగ్‌ ట్రంప్ రిసార్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతోంది.

దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆ సమయంలో ఆమె వద్ద మాల్‌వేర్ ఉన్నట్లు అనుమానించినప్పటికి దర్యాప్తులో ఇది అబద్ధమని తేలింది.

Telugu Chinese Jailed, Telugu Nri Ups, Trumps Mar Lago-

ఇదే సమయంలో జాంగ్‌ ఇప్పటి వరకు ఏడున్నర నెలలు జైలులో ఉన్నారు.అయితే నిషేధిత జోన్‌లోకి ప్రవేశించి.స్విమ్మింగ్ ఫూల్ ఉపయోగించేందుకే తాను రిసార్ట్‌లోకి వచ్చినట్లు ఫెడరల్ అధికారికి అబద్ధం చెప్పినందుకు జాంగ్‌ దోషిగా నిర్థారించబడింది.జైలు శిక్ష విధించే వరకు రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

ఈ మధ్యలోనే చాంగ్ మరోసారి స్టోరీని మార్చేసింది.తానను ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో పాల్గొనేందుకే అక్కడికి వచ్చానని చెప్పింది.

ఫోర్ట్ లాడర్టేల్‌లోని ఫెడరల్ కోర్టు విచారణలో ఎట్టకేలకు తాను ట్రంప్, అతని కుటుంబసభ్యులను కలిసేందుకే వచ్చానని ఆమె నేరాన్ని అంగీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube