ఒకపక్క కరోనా వైరస్ కలకలం,గబ్బిలాన్ని తినేసిన అమ్మాయి  

Chinese Woman Eating Bat At Restaurant-telugu Viral News Updates,viral In Social Media,woman Eating Bat,గబ్బిలాన్ని తినేసిన అమ్మాయి

ఇటీవల దేశాలని గడగడా లాడిస్తున్న కొత్త వైరస్ కరోనా.ఈ వైరస్ చైనా నుంచి పాక్కుంటూ భారత్ కు కూడా చేరింది అంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే.

Chinese Woman Eating Bat At Restaurant-Telugu Viral News Updates Viral In Social Media Woman గబ్బిలాన్ని తినేసిన అమ్మాయి

అయితే ఈ కరోనా వైరస్ కు ప్రధాన కారణం పాము,గబ్బిలాలు వంటి వాటివల్ల అని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి గబ్బిలాన్ని తిని అందరి మతులు పోగొట్టింది.

ఒకపక్క పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు పాము,గబ్బిలాలు వల్లే ఈ వైరస్ వ్యాపిస్తుంది అని అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంటే చైనా కి చెందిన ఈ అమ్మాయి మాత్రం చాలా కూల్ గా గబ్బిలాన్ని తినింది.ఇప్పుడు ఈ గబ్బిలాన్ని తింటున్న వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

ఒక రెస్టారెంట్ కు వెళ్లిన ఆ అమ్మాయి గబ్బిలం తో చేసిన సూప్ ను తాగింది.అంతేకాకుండా వండిన గబ్బిలాన్ని కూడా ఆమె ఎంతో ఇష్టంగా లాగించేసింది.

అయితే గబ్బిలం మాంసం తో పాటు దాని చర్మాన్ని కూడా తినే ప్రయత్నం చేసింది కానీ, చర్మం తినకూడదు అని పక్కనే ఉన్న వ్యక్తి చెప్పడం తో కొంచం ఆగింది.మొత్తానికి ఒకపక్క చైనా లో ఈ కరోనా వైరస్ తో ఇప్పటికే 17 మంది మృతి చెందగా మరో 600 మందికి ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది.

మరి ఇంత స్పష్టంగా పాము,గబ్బిలాల వల్లే ఈ వైరస్ సోకుతుంది అని అంత క్లియర్ గా చెబుతున్నప్పటికీ ఈ అమ్మాయి మాత్రం ఇలా గబ్బిలం తినడం తో అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు.

తాజా వార్తలు

Chinese Woman Eating Bat At Restaurant-telugu Viral News Updates,viral In Social Media,woman Eating Bat,గబ్బిలాన్ని తినేసిన అమ్మాయి Related....