కరోనా వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందంటున్న చైనీస్ శాస్త్రవేత్త!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేసింది.

 Chinese Virologist Says She Has Proof Covid-19 Was Made In Wuhan Lab,chinese Vi-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ ప్రజల విధానాన్ని మార్చేసింది.ఇక ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ కి సంబంధించిన వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.
అదేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.కరోనా వైరస్ వుహాన్ నగరంలో పుట్టిందని ఒకప్పుడు వార్తలు వచ్చినప్పటికి అది ఎంతమాత్రం నిజం కాదని చైనీయులు కొట్టిపడేశారు.

కానీ అదే నిజం అని అంటుంది చైనీస్ శాస్త్రవేత్త.కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని అంటుంది ఆమె.అలా ఎలా? అని మీకు ఆశ్చర్యం వేస్తుంది కదా!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ ”చైనాలోని వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ పుట్టిందని” సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు గతేడాది డిసెంబర్ లో ఈ వైరస్ ను సృష్టించారని ఆమె తెలిపారు.అయితే కరోనా సృష్టించినట్టు వస్తున్న ఆరోపణలపై చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది.

అమెరికా సైతం నిత్యం ఆరోపణలు చేస్తూనే వస్తుంది.ఇక ఇప్పుడు మహిళా వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి వైరల్ గా మారాయ్.

వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందని ఆమె దగ్గర కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్నట్టు చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ తెలిపారు.చైనాలో మాంసం మార్కెట్ నుంచి ఈ వైరస్ రాలేదని ల్యాబ్ నుంచి ఈ వైరస్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

వైరాలజిస్ట్ చేసిన సంచలన వ్యాఖ్యలతో నెట్టింట్లో మరోసారి చైనాపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా చైనాలో పుట్టిన కరోనా వైరస్ కు ఇప్పటికి 9 లక్షలమందికిపైగా బలయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube