కరోనా ఎప్పటికి అంతం కాదు... సీజనల్ వ్యాదులలో కలిసిపోతుంది

ఈ ప్రపంచంలో ప్రతి వందేళ్ళకి ఒకసారి ఓ కొత్త వైరస్ పుట్టుకురావడం అది మనిషితో పాటే ఈ ప్రపంచంలో మానవ శరీరాలని లేదంటే క్రిమి కీటకాలు, జంతువులని ఆవాసంగా చేసుకొని జీవించడం, మనుషుల మీద దాడి చేయడం చేస్తూనే ఉన్నాయి.అలాగే ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని విపరీతంగా భయపెడుతుంది.

 Chinese Scientists Predict Corona Virus Won't Be Eradicated, Lock Down, Corona E-TeluguStop.com

ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరిని చంపేసేంత శక్తి లేకపోయినా శారీరక సామర్ధ్యం లేనివారి ప్రాణాలని మాత్రం హరించేస్తుంది. ఈ వైరస్ కారణంగా డేట్ రేషియో ఒక్కశాతం కంటే తక్కువగానే ఉంది.

అయినా కూడా కరోనా మహమ్మారి కావడంతో మనిషి నుంచి మనిషికి వ్యాపించే వైరస్ కావడంతో దీనిని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు విశ్వమంతా చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏపీ సిఎం జగన్ కరోనాని పూర్తిగా అంతం చేయడం సాధ్యం కాదని, భవిష్యత్తులో కరోనా వైరస్ తో కలిసే మనిషి బ్రతకాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే దీని మీద చాలా మంది విమర్శలు చేశారు.అయితే ఇప్పుడు కరోనా వైరస్ పుట్టిన దేశంలో శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

కరోనా వైరస్ ను పూర్తిగా భూగోళం నుంచి తరిమివేయడం కుదరదని ఇప్పుడు ఆ వైరస్ కట్టడి కోసం చేపడుతున్న చర్యలు తాత్కాలికమేనని ఆ వైరస్ ప్రతి సంవత్సరం వస్తుందని చైనా శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు.ఆ వైరస్ ని నిర్మూలించలేమని స్పష్టం చేశారు.

సాధారణంగా వచ్చే వ్యాధుల మాదిరి కరోనా వైరస్ కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 17 ఏళ్ల క్రితం ప్రబలిన సార్స్ (SARS) వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదని తేల్చి చెప్పారు.

భవిష్యత్లో ఈ వైరస్ జ్వరం వంటి లక్షణాలు కనిపించకుండానే వ్యాపించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని ఆందోళనకర విషయం తెలిపారు.చైనీస్ వైరల్ గ్రూపు మెడికల్ రీసెర్చర్లు ఈ విషయాన్ని వెల్లడించారు.

సీజనల్ వ్యాధుల మాదిరిగానే కరోనా వైరస్ కూడా వ్యాపిస్తుందని తెలిపారు. దీనిని శాశ్వత పరిష్కారం కేవలం మెడిసన్ కనిపెట్టి కంట్రోల్ చేయడం మాత్రమే అని చెప్పారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube