మొదటిసారి విమానం ఎక్కుతూ సంతోషంతో అతడు చేసిన పనితో విమానం ఆగింది.. 15 లక్షల నష్టపరిహారం

విమాన ప్రయాణం అనేది అత్యంత ఖరీదుతో కూడుకున్న విషయం.మనదేశంలోనే కాకుండా ఏ దేశంలో అయినా కూడా విమాన ప్రయాణం అంటే జనాలు ఎంతో ఆసక్తిని కనబర్చడంతో పాటు, మోజు పడతారు.

 Chinese Passenger Throws Lucky Coin Into Planes Engine For Good Luck-TeluguStop.com

మొదటి సారి విమానం ఎక్కబోతున్న వారు ఎంతో సంతోషంగా కనిపిస్తూ, ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉంటారు.విమానం ఎక్కిన తర్వాత మొదటి జర్నీ ఎంతో ఆనందంగా సాగుతుంది.

అయితే చైనాకు చెందిన లూ అనే 28 ఏళ్ల వ్యక్తి మొదటి విమాన ప్రయాణం అత్యంత బాధాకరంగా జరిగింది.అతడి అత్యుత్సాహం కారణంగా విమానం ఆగిపోవడంతో పాటు 15 లక్షల నష్టపరిహారంను కూడా లూ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన లూ అనే వ్యక్తి ఇటీవల లక్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో అన్హుయి నుండి యున్నన్‌కు బయలు జేరాడు.తన భార్య, కుమారుడితో అత్యంత సంతోషంగా లూ తన ప్రయాణంను సాగించాలని కోరుకున్నాడు.

మొదటి సారి విమానం ఎక్కబోతున్న నేపథ్యంలో అతడి ఆనందానికి అవదులు లేవు.చైనాలో ఉన్న ఆచారం ప్రకారం ఏదైనా పని మొదలు పెట్టబోతున్న సమయంలో లేదంటే ఏదైనా ప్రయాణం మొదలు పెట్టబోతున్న సమయంలో గుడ్‌ లక్‌ కాయిన్‌ అంటూ విసిరేస్తారు.

ఆ కాయిన్‌ ను కళ్లు మూసుకుని విసిరేసి దేవుడిని ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటారు.

లూ కూడా గుడ్‌ లక్‌ కాయిన్‌ను విసిరాడు.లూ విసిరిన గుడ్‌ లక్‌ కాయిన్‌ నేరుగా వెళ్లి విమానం ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌లో పడింది.లూ నాణెం విసిరిన విషయం గమనించని అధికారులు విమానంను నడిపేందుకు ప్రయత్నించగా ఇంజన్‌ మెరాయించింది.

అలాగే ప్రయత్నించిన సమయంలో ఇంజిన్‌ మొత్తం ఫెయిల్‌ అయ్యింది.దాంతో అధికారులు ఆరా తీయగా లూ వేసిన కాయిన్‌ వల్ల అది పాడయ్యిందని నిర్థారణకు వచ్చారు.దాంతో లూను అదుపులోకి తీసుకోవడంతో పాటు, ఆ ఇంజిన్‌కు అయ్యే మొత్తంను లూతో కట్టించాలని నిర్ణయించుకున్నారు.15 లక్షల రూపాయలను లూతో కట్టించినట్లుగా తెలుస్తోంది.లూ చేసిన పనితో ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు ఒక రోజంతా కూడా వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube