సింగపూర్‌: భారతీయులపై చైనీయుడి తిట్ల దండకం... నోరు మూయించిన ఇండియన్

భారతీయులపైనా, భారతదేశంపైనా అసభ్యంగా మాట్లాడుతూ.ఎక్స్‌ట్రాలు చేస్తున్న ఓ చైనీయుడికి ఓ ఇండియన్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి అతని నోరు మూయించాడు.

 Chinese Man Criticize Indians In Singapore Hotel Video Goes Viral-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.సింగపూర్‌లోని ఓ హోటల్‌కి చైనీయుడు వెళ్ళాడు.

మరి అక్కడ ఏం జరిగిందో, ఏమో కానీ అతనికి పట్టరాని కోపం వచ్చింది.అంతే హోటల్‌లో పనిచేస్తున్న భారతీయ సిబ్బందిపై చిందులు తొక్కాడు.

 Chinese Man Criticize Indians In Singapore Hotel Video Goes Viral-సింగపూర్‌: భారతీయులపై చైనీయుడి తిట్ల దండకం… నోరు మూయించిన ఇండియన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారతీయులు ఆసియా మొత్తం వ్యభిచారం చేస్తున్నారంటూ అసభ్యపదజాలంతో దూషించాడు.అక్కడితో ఆగకుండా భారతీయులు చాలా ప్రమాదకరమైన వారంటూ కామెంట్లు చేస్తూనే వున్నాడు.

ఆ హోటల్‌లో పనిచేస్తున్న సిబ్బంది, తోటి కస్టమర్లు కూడా అతని విన్యాసాలను మౌనంగా భరిస్తున్నారు.అదే సమయంలో ఆ హోటల్‌కు వచ్చిన ఓ భారతీయుడికి మాత్రం అతగాడి మాటలతో కోపం నషాళానికి అంటింది.

నా దేశాన్ని, నా తోటి భారతీయులను తిడతావా అంటూ ఆ చైనీయుడిని చితక్కొట్టాడు.అతనిని ఎవరో ఒకరు ఆపుతారేమోనని చూసిన ఆ చైనీయుడికి అలాంటి సూచనలు కనిపించకపోయేసరికి బ్రతుకుజీవుడా అంటూ ఆ హోటల్ నుంచి పారిపోయాడు.

ఈ ఘటన ఎప్పుడు , ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొద్దిరోజుల క్రితం అదే సింగపూర్‌లో భారత సంతతి యువకుడిపై చైనీయుడు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి.

నాటి ఘటనలో భారత సంతతికి చెందిన దేవ్ ప్రకాష్ అనే వ్యక్తి చైనా మూలాలున్న యువతితో డేటింగ్ చేస్తున్నాడు.ఈ క్రమంలో వీరిద్దరూ జూన్ 5న ఈస్ట్ షాపింగ్ సెంటర్ జంక్షన్ సమీపంలోని వీలాక్ ప్లేస్‌లో కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఈ సమయంలో వారి వద్దకు వచ్చిన ఓ చైనా సంతతి యువకుడు.తమ దేశానికి చెందిన యువతితో దేవ్ డేటింగ్ చేయడాన్ని తప్పుబట్టాడు.

‘మీ జాతికి చెందిన వాళ్లతోనే నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉండాలి’ అని వాగ్వాదానికి దిగాడు.అలాగే చైనా యువతిని సైతం వదల్లేదు.

నువ్వు ‘‘ ఒక భారతీయుడితో డేటింగ్ చేసినందుకు మీ తల్లిదండ్రులు గర్వపడతారు అనుకుంటున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చైనా యువతులను భారతీయ పురుషులు వేటాడుతున్నారని మండిపడ్డాడు.

ఈ తతంగం మొత్తాన్ని సదరు యువతి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది.తొమ్మిది నిమిషాల నిడివి వున్న సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దేవ్.

తామిద్దరం వేర్వేరు జాతులకు చెందిన వ్యక్తులమని.తాము ప్రేమించుకుంటున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని ఒక వ్యక్తి బహిరంగంగా అవమానించాడని దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాము ఏదో తప్పు చేసినట్లు ప్రశ్నిస్తున్నాడని.వేర్వేరు మూలాలు ఉన్నప్పటికీ, తాము సింగపూర్ వాసులం కావడం గర్వకారణమన్నాడు.

ప్రేమకు జాతి , మతం లేదని.మనం ప్రేమించాలనుకునే వారిని ప్రేమించగలగాలి తప్ప.

ఈ వీడియోలో ఉన్న వ్యక్తిలా మారకూడదని దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

#Indian #Social Media #Cellphone #EastShopping #Singapore

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు