వైరల్‌ వీడియో : భార్యకోసం వంగి కుర్చీలా మారాడు, ఎందుకో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు

ఏదో సినిమాలో భరించేవాడే భర్త అంటూ డైలాగ్‌ ఉంటుంది.భార్యను భరించే వాడే నిజమైన భర్త అని, భార్య ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ ఉండే వాడే భర్త అంటూ ఫన్నీ మీమ్స్‌ వస్తూ ఉంటాయి.

 Chinese Man Becomes Humanchair For Pregnant Wife-TeluguStop.com

ఒక భారత దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా భార్యలను భర్తలు భరిస్తూనే ఉంటారు.ఒకసారి కాకుంటే ఒకసారి అయినా భార్యలను భర్తలు భరించాల్సిందే.

అలా భరించకుంటే ఆడవారి మెంటాల్టీకి ఖచ్చితంగా విడిపోవాల్సి ఉంటుంది.భరించలేని వాడు భర్త అవ్వడు అంటూ ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ ఆమద్య బాగా వైరల్‌ అయ్యింది.

అంటే ఏ స్థాయిలో భర్తలు భరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

భరించేవాడే భర్త అనేందుకు మరో చక్కనైనా ఉదాహరణగా ఈ వీడియో నిలిచింది.చైనాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఒక భర్త తన భార్యను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లాడు.

ఆమె ప్రెగ్నెంట్‌ అవ్వడంతో ఎక్కువ సమయం నిలబడలేక పోతుంది.అప్పటికే ఆమెకు కాళ్లు నొప్పులు ప్రారంభం అయ్యాయి.

డాక్టర్‌ బిజీగా ఉండటంతో వారు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.కుర్చునేందుకు సీట్లు లేవు.

అందరు కూడా ప్రెగ్నెంట్‌ వాళ్లే అవ్వడంతో ఎవరు లేచే పరిస్థితి లేదు.దాంతో ఆ భర్త తానే వంగి కుర్చిలా మారిపోయాడు.

అతడు కింద కూర్చుంటే ఆమె అతడి వీపు మీద కూర్చుని కాస్త రిలాక్స్‌ అయ్యింది.అలా దాదాపు 20 నిమిషాలు ఆమె అలాగే కూర్చుని ఉంది.అంతలో కొందరు అటుగా వెళ్లడం వారి ఇబ్బందిని గమనించి వారికి ఒక సీటు ఇవ్వడం జరిగింది.అలా ఆ చైనా భర్త ప్రస్తుతం ప్రపంచంలోనే ది బెస్ట్‌ భర్త అంటూ కామెంట్స్‌ పొందుతున్నాడు.

తన భార్యకు ఇబ్బంది లేకుండా ఉండేలా అతడు చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.నిజంగా ఇలాంటి భర్తలు ఉంటారా అంటూ పెళ్లి కాని అమ్మాయిలు అనుకుంటూ మాకు ఇలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube