ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఏకంగా..!

ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు.కొంత మంది ప్రవర్తించే తీరుతో చాలా మందిలో ఆశ్చర్యం కలుగుతుంది.

 Chinese Girlfriend Took Revenge On Former Boy Friend By Breaking Traffic Signals-TeluguStop.com

కొన్ని సార్లు మనుషులు ప్రవర్తించే తీరు చాలా గమ్మత్తుగా ఉంటుంది.ఒకరిపై కోపాన్ని మరొకరిపై ప్రదర్శిస్తుంటారు.

ఇలా చైనాకు చెందిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ పై కోపాన్ని కారుపై చూపి చిక్కుల్లో పడింది.అసలు ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేసిన పోలీసులకు విచారణలో దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి… ఇంతకీ అసలేం జరిగిందంటే…

చైనాలోని షాక్సింగ్ ఏరియాలో నివాసముండే ఝా అనే మహిళ చేసిన పనిని గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు.

తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కావడంతో అతడిపై ఎలాగైనా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని భావించిన ఝా తన స్నేహితురాలు లౌతో కలిసి చెన్ కియాన్ అనే వ్యక్తికి చెందిన ఓ కారు అద్దెకు తీసుకుంది.కారును అద్దెగా తీసుకున్న ఝా తన మాజీ బాయ్ ఫ్రెండ్ మీద ప్రతీకారంతో రెండు రోజుల్లోనే 49 సార్లు సిగ్నల్స్ బ్రేక్ చేసిందట.

Telugu Signals Times, Car Challana, Chaina-Latest News - Telugu

ఇది గమనించిన పోలీసులు ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టరై ఉందో అతడిని పిలిపించి విచారించగా….తనకేం సంబంధం లేదని తాను ఝా అనే అమ్మాయికి కారును అద్దెకిచ్చానని చెప్పాడు.దాంతో పోలీసులు ఝాను పిలిచి విచారించి… తాను చెప్పిన నిజాలను విని నోరెళ్లపెట్టారు.తన బాయ్ ఫ్రెండ్ మీద కసితోనో ఇదంతా చేశానని తాను పోలీసులకు తెలిపింది.

ఇలా సిగ్నల్స్ బ్రేక్ చేయడంలో కారు అసలు ఓనర్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.అంతే కాకుండా ఝా తన బాయ్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా వచ్చిన ఓ బైకును కూడా కాల్చేసినట్లు ఒప్పుకుంది.

ఇలా ఝా చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ తిన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube